Saturday, May 4, 2024
- Advertisement -

ఆంధ్ర స్పెషల్.. టమోటా పప్పు ఎలా చెయ్యాలంటే?

- Advertisement -

ఆంధ్రాలో అడుగు పెడితే మనకు అక్కడ ప్రతి రోజు వారి భోజనంలో భాగంగా టమోటా పప్పు తప్పనిసరిగా ఉంటుంది. టమోటా పప్పు లేనిదే వారి రోజు భోజనం ఉండదు. మరి ఆంధ్రాలో ఎంతో ఫేమస్ అయిన ఈ టమోటా పప్పు ఎలా తయారు చేసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం…

కావలసిన పదార్థాలు:
*కందిపప్పు ఒక కప్పు, టమోటాలు 4, పచ్చిమిర్చి10, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ ఒకటి, వెల్లుల్లి ఒకటి, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె ఐదు టేబుల్ స్పూన్లు, పోపుకు ఆవాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్. కరివేపాకు రెమ్మ, ఎండు మిర్చి

తయారీ విధానం:
*ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి కందిపప్పును శుభ్రంగా కడిగి వేసుకోవాలి.అదేవిధంగా టమోటాలు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్ లో వేసుకోవాలి.

Also read:అదృష్టంతో బతికిపోయానంటున్న స్టార్ నటుడు.. ఎవరంటే?

*వీటిలోకే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు రెమ్మ, గుప్పెడు కొత్తిమీర వేయాలి. అదేవిధంగా చిటికెడు పసుపువేసి తగినంత నీరు పోసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఎదురు చూడాలి.

*మూడు విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ మొత్తం వెళ్లే వరకు వేచి ఉండాలి. ప్రెజర్ మొత్తం వెళ్ళిపోగానే కుక్కర్ మూత తీసి తగినంత ఉప్పును వేసుకుని పప్పును బాగా మెత్తగా రామాలి.

Also read:ప్లీజ్… 40 రూపాయిలు ఇవ్వండంటున్న రాశీ ఖన్నా!

*స్టవ్ మీద అ ఒక కడాయి ఉంచి పోపుకోసం కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులోకి పోపుదినుసులు, ఉల్లిపాయ వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు రెమ్మ రెండు ఎండు మిర్చి వేసి ఆవాలు చిటపట అన్న తరువాత పోపును ముందుగా తయారు చేసుకున్న పప్పులు వేయటంతో ఎంతో రుచికరమైన టమాటా పప్పు తయారైనట్టే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -