ప్లీజ్… 40 రూపాయిలు ఇవ్వండంటున్న రాశీ ఖన్నా!

- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఎలాంటి భయంకరమైన వాతావరణాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది ఉపాధి లేక వారి జీవితాలు రోడ్డున పడ్డాయి. ఈ క్రమంలోనే రోజు పూట గడవడం వారికి అతి కష్టంగా మారింది. అదే విధంగా ఈ కరోనా కాటుకు ఎంతో మంది తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలారు. ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి ఎంతో మంది సెలబ్రెటీలు దాతలు ముందుకు వచ్చి వారికి తోచిన రీతిలో సహాయాన్ని అందిస్తున్నారు. ఈ విధంగా సహాయం చేస్తున్న వారిలో రాశీ ఖన్నా ఒకరు.

రాశీ ఖన్నా రోటి ఫౌండేషన్ అనే సంస్థతో కలిసి ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీర్చుతున్నారు. ఇందుకు సంబంధించి రాశీ ఖన్నా గత కొద్ది రోజుల క్రితం ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రాశి ఖన్నా మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడం కోసం కేవలం నలభై రూపాయలను విరాళంగా ఇస్తే చాలని ఆమె వేడుకున్నారు.

- Advertisement -

Also read:నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అంటూ నటికి ప్రేపోజల్!

ప్రస్తుతం ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి విరాళాలను అందించడంతో ఎంతోమంది పేద వారికి కడుపునిండా భోజనం పెట్టగలాగతున్నాము.అదే విధంగా మరి కొంత మంది దాతలు ముందుకు వస్తే మరి కొంతమందికి ఆకలి తీర్చిన వారవుతారని ఈ సందర్భంగా రాశీ ఖన్నా తెలియజేశారు.విరాళంగా వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని ఏమాత్రం దుర్వినియోగం చేయకుండా అది పేద వారి కోసం సద్వినియోగం చేస్తున్నట్లు నటి రాశీ ఖన్నా పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె నాగచైతన్యతో కలిసి థాంక్యూ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Also read:సమంత రంగుపై విమర్శలు వస్తాయని తెలుసు..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -