అదృష్టంతో బతికిపోయానంటున్న స్టార్ నటుడు.. ఎవరంటే?

- Advertisement -

మలయాళ స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న పాన్‌ ఇండియా సినిమా “పుష్ప” తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో ఫ‌హాద్ ఫాజిల్ అల్లు అర్జున్‌ ను ఢీకొట్టే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప రాజ్ గా మాస్ లుక్ తో కనిపించనున్నాడు.

ఇప్పటికే ఈ మూవీపై భారీఅంచనాలు నెలకొన్న సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీలో ప్రతి పాత్ర పట్ల స్పెషల్ కేర్ తీసుకొని ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. చిత్రానికి సంబంధించిన మేజర్ షూటింగ్ కంప్లీట్ చేసుకోనీ డబ్బింగ్‌ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఆగస్టు13న విడుదల కానుందనీ చిత్ర యూనిట్ ప్రకటించింది.

- Advertisement -

Also read:అరియానతో ఆర్జీవీ హాట్ వర్కౌట్స్.. వామ్మో!

తాజాగా ఫహద్‌ ఫాజిల్‌ తనకు జరిగిన ప్రమాదం గురించి సోషల్‌ మీడియాలో వివరాలు వెల్లడించాడు. మలయాన్‌కుంజు సినిమా చిత్రీకరణ సమయంలో చాలా ఎత్తు నుంచి కింద పడిపోయానని తెలిపాడు. సాధారణంగా ఎత్తు నుంచి కింద పడేటప్పుడు చేతులు ముందుకు చాచడం అంత ఈజీ కాదు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో నా మెదడు చురుగ్గా పని చేయడంతో నా తలకు చేతులు అడ్డుగా ఉంచి ప్రమాదం నుంచి బయటపడ్డానని తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు.హీరో ఫహద్‌ ఫాజిల్‌ తాజాగా నటించిన “మాలిక్‌” సినిమా ఇటీవలే ఓటీటీ లో విడుదల విషయం తెలిసిందే.

Also read:సమంత రంగుపై విమర్శలు వస్తాయని తెలుసు..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -