Monday, May 13, 2024
- Advertisement -

హైదరాబాద్ మెట్రో ప్రత్యేకతలు.. డ్రైవర్ లేకుండానే ప్రయాణం..

- Advertisement -

ఇప్పుడు ఎక్కడ చూసిన టెక్నాలిజీ తో అన్ని పనులు అయిపోతున్నాయి. ప్రధానంగా రవాణా వ్యవస్థలో అయితే అన్ని ప్రభుత్వాలు ఎవరి స్థాయిలో వారు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి పనులతో తెలంగాణను మరింత అభివృద్ధి చేస్తోంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న మెట్రో రైళ్లు కూడా త్వరలోనే భాగ్య నగరంలో సందడి చేయబోతుంది. ఇప్పటికే మెట్రో పనులు దాదాపు కంప్లీట్ అయ్యాయి.

వచ్చే నెల ఘనంగా స్టార్ట్ అవ్వనున్నాయి. అయితే మెట్రోలో ప్రత్యేకతలు తెల్లుస్తే.. దిమ్మతిరగాల్సిందే. మొన్నటి వరకు డ్రైవర్లు ఉన్న రైళ్లని చూశాము. కానీ ఇప్పుడు డ్రైవర్ లేని మెట్రొ ట్రైన్ జెట్ స్పీడ్ లో గమ్యాన్ని చేరుస్తుంది. బేస్డ్ ట్రైన్ కంట్రోల్ (సీబీటీసీ) సాంకేతిక పరిజ్ఞానంతో మొత్తం కంట్రోల్ రూమ్ నుంచే మెట్రో ట్రైన్ ని ఆపరేటింగ్ చేయనున్నారట. ఆపరేటింగ్ మొత్తం ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ నుండే జరుగుతోంది. ఇక టికెట్టు లేకుండా ఈ మెట్రో రైళ్లులో ప్రయణించే అవకాశం అసలు ఉండదు. . ఎందుకంటే ట్రైన్ ఎక్కే ముందే ఎంట్రీ గెట్ వద్ద అత్యాధునిక టెక్నాలిజీతో అమర్చిన మెషిన్ వద్ద కొన్న టికెట్ ను మెషిన్ కి చూపిస్తేనే ఎంట్రీ ఉంటుంది.

ఇక భద్రత విషయంలో కూడా అధికారులు అన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి విషయం అధికారులు తెలుసుకునేందుకు సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఏదైనా ప్రమాదం జరిగినా కూడా వెంటనే అందుబాటులో ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థ ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -