Sunday, May 5, 2024
- Advertisement -

బీసీసీఐ నిర్ణయంతో షాక్‌లో ఫ్యాన్స్!

- Advertisement -

రేపటి నుండి వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభంకానుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తుండగా 10 దేశాలు పాల్గొంటున్నాయి. ఇక ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌లు పూర్తికాగా తొలుత షెడ్యూల్ ప్రకారం ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది బీసీసీఐ.

వరల్డ్ కప్ ప్రారంభవేడుకలు అంటే కన్నుల పండగే. అందుకే ఓపెనింగ్ సెర్మనీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురుచూస్తారు. రణ్‌వీర్ సింగ్, అరిజిత్ సింగ్, తమన్నా భాటియా, శ్రేయా ఘోషల్, ఆశా భోంస్లేలాంటి వాళ్లతో ఆట,పాటలను బీసీసీఐ సిద్ధం చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓపెనింగ్ వేడుకలు రద్దైనట్లు తెలుస్తోంది.

ఓపెనింగ్ సెర్మనీకి బదులుగా.. అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇక తొలి మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్- రన్నరప్ న్యూజీలాండ్ జట్లు తలపడనున్నాయి. అయితే కెప్టెన్స్ డేను మాత్రం య‌థావిధిగా నిర్వహించాల‌ని బీసీసీఐ భావిస్తోంద‌ని సమాచారం. అంటే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు అన్ని జట్ల కెప్టెన్లతో కలిసి ఫొటో సెషన్ నిర్వహిస్తారు.

ప్రపంచకప్‌లో పాల్గొనే పది జట్ల కెప్టెన్లు భారత్: రోహిత్ శర్మ,ఇంగ్లాండ్ : జోస్ బట్లర్,ఆస్ట్రేలియా : ప్యాట్ కమిన్స్,న్యూజీలాండ్ : కేన్ విలియమ్సన్,దక్షిణాఫ్రికా: టెంబా బావుమా,పాకిస్థాన్ : బాబర్ ఆజం,శ్రీలంక : దసున్ షనక,బంగ్లాదేశ్ : షకీబ్ అల్ హసన్,నెదర్లాండ్స్ : స్కాట్ ఎడ్వర్డ్స్,అఫ్గానిస్తాన్ : హష్మతుల్లా షాహిది ఫోటో సెషన్‌లో పాల్గొననున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -