Sunday, May 5, 2024
- Advertisement -

ఇండియా ఐటి ఉద్యోగులు పల్లెబాటేనా..?

- Advertisement -

ఇండియన్స్ కు ఐటి రంగం అందుబాటులోకి వచ్చాక వారి జీవన విధానాలే మారిపోయాయి. బళ్లు ఓడలయ్యాయి. టోటల్ సిస్టమ్ మారిపోయింది. వెనకాల ఎంత ఆస్థి ఉందని థింక్ చేయకుండా…. అబ్బాయి ఏ ఐటి కంపెనీలో జాబ్ చేస్తున్నాడ అని ఎంక్వైరీలు ఎక్కువయిపోయాయి. దీంతో ఐటి ఉద్యోగం ఉంటే చాలు అనుకుని ఎవరికి వారు పెద్ద పెద్ద సంబంధాలు కుదిర్చేసుకున్నారు. ఇది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. కాని భవిష్యత్ లో ఇది మాత్రం సాకారం అయ్యేలా కనిపించడం లేదు. దీనికి కారణం…’మెకిన్సే’ అనే గ్లోబల్ రీసెర్చ్‌ సంస్థ తన తాజా సర్వేతో తేల్చిపారేసింది.

ఐటీలో ఆటోమేషన్ భూతం వచ్చేస్తూ ఉండడంతో రోబో టెక్నాలజీ, ఆటోమేషన్ ప్రక్రియలతో నలుగురు చేసే పని ఒక్కరే చేసేలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సరికొత్త విప్లవం పుట్టుకొచ్చేస్తుంది. మరో పన్నెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్లు అంటే.. 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ‘మెకిన్సే’ అనే గ్లోబల్ రీసెర్చ్‌ సంస్థ తేల్చిచెప్పింది. అంటే.. మొత్తం ప్రపంచ కార్మికుల సంఖ్యలో ఐదో వంతు మంది ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఒక్క ఇండియాలోనే ఈ ఆటోమేషన్ తాకిడికి దాదాపు 12 కోట్ల మంది రోడ్డు మీద పడే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చవచ్చు.

కాని ఫేస్ బుక్ లాంటి కొన్ని జెయింట్ సోషల్ మీడియా సంస్థలు.. ఆటోమేషన్ ప్రయోగాలు చేసినప్పటికీ… అవి ఏమాత్రం మంచి ఫలితాలను ఇవ్వలేదు. అవి కాస్తా తిరగబడ్డంతో చాలా సంస్థలు మళ్లీ థింక్ చేయడం మొదలుపెట్టాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక్కటే… ప్రపంచ అగ్రగామి రీసెర్చ్ సర్వే సంస్థ.. మెకిన్సే లాంటి క్రెడిబులిటీ వున్న సంస్థే ఈ న్యూస్ వెలువరించింది కాబట్టి… భవిష్యత్ గురించి ఆలోచించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేల అదే జరిగితే అందరూ వ్యవసాయం మీద పడొచ్చేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -