Friday, April 26, 2024
- Advertisement -

రైల్వేశాఖలో 1.4 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్…!

- Advertisement -

రైల్వేశాఖలో 1.4 లక్షల ఉద్యోగాలకు నిర్వహించే కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షలకు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అన్నిఏర్పాట్లు చేస్తున్నామని రైల్వేశాఖ తెలిపింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 2.44 కోట్ల మందికి తక్కువ దూరంలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కొవిడ్‌ నిబంధలు పాటిస్తూ రవాణా సౌకర్యం ఉంటుందని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని అధికారులు తెలిపారు.

తొలి దఫా పరీక్షలు ఈనెల 15 నుంచి 18 వరకు, రెండవ దశ పరీక్షలు.. డిసెంబర్‌ 28 నుంచి 2021 మార్చి వరకు జరుగుతాయని రైల్వేశాఖ తెలిపింది. పరీక్ష రాసే అభ్యర్థులు కొవిడ్‌ నెగిటివ్‌ పరీక్షల ఫలితం తీసుకురాలేని పక్షంలో డిక్లరేషన్‌లో పరీక్ష రాసేందుకు సిద్ధమని సంతకం చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు.

పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థి శరీర ఉష్టోగ్రత సాధారణం కంటే ఎక్కువ ఉంటే ఆ అభ్యర్థితో మరో తేదీలో పరీక్ష రాయిస్తామని తెలిపారు. పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందు హాల్‌టికెట్‌ని.. ఆయా ఆర్​ఆర్​బీ వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -