Saturday, April 27, 2024
- Advertisement -

మాయాబజార్ సినిమాలో​.. భలే భలే టైటిల్స్!

- Advertisement -

‘మాయాబజార్’ సినిమా మనందరికీ మరపురానిది. ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టని సినిమా. అందులో పింగళి నాగేంద్రరావు గారి డైలాగులకు ఇప్పటికీ వీరతాళ్లు వేస్తూనే ఉన్నాం. ఘంటసాల గారి పాటలను మైమరచి వింటున్నాం.

దర్శకుడు జంధ్యాల గారికి ‘మాయాబజార్’ అంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టాన్ని తన సినిమా టైటిల్స్ ద్వారా బయట పెట్టారు. తాను దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు ఆ సినిమాలోని పాటలు, డైలాగులను పేర్లుగా పెట్టుకున్నారు. అవి మన వాడుకలో చక్కగా ఒదిగిపోయాయి‌.

అహనా పెళ్లంట
మాయాబజార్ సినిమాలో ‘అహనా పెళ్లంట’ పాట ఎంత ఫేమస్సో, అదే పేరుతో వచ్చిన చిత్రం అంత‌ ఫేమస్. రాజేంద్రప్రసాద్, రజని జంటగా నటించిన ఈ చిత్రం చాలా మందికి ఆల్‌టైం ఫేవరేట్. లక్ష్మీపతిగా కోట, అరగుండుగా బ్రహ్మానందం నటన నభూతో నభవిష్యత్.

ఓహొ నా పెళ్లంట
‘అహనా పెళ్లంట’ తర్వాత లైన్ ఇది. 1996లో హరీష్, సంఘవి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేకపోయింది.

చూపులు కలసిన శుభవేళ
మాయాబజార్ సినిమాలో ఈ పాట ఎంత ఫేమస్సో చెప్పనవసరం లేదు. ఆ పల్లవినే సినిమా టైటిల్‌గా పెట్టి, నరేష్, మోహన్, అశ్విని, సుధ హీరో, హీరోయిన్లుగా జంధ్యాల సినిమా తీశారు. జనాన్ని ఆకట్టుకున్న చిత్రం ఇది. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు, సుత్తి వీరభద్రరావు పాత్రలు అజరామరం.

వివాహ భోజనంబు
తెలుగు సినిమా పాటల్లో ప్రత్యేకమైన స్థానం ఉన్న పాట ఇది. ఇదే పేరుతో సినిమా తెరకెక్కించారు జంధ్యాల. రాజేంద్రప్రసాద్, అశ్విని జంటగా నటించారు. చంద్రమోహన్, హరీష్, రమాప్రభ ఇతర పాత్రలు పోషించారు.

హైహై నాయకా
మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి సైన్యం మాటిమాటికీ అనే మాట ఇది. దీన్నే టైటిల్‌గా పెట్టి, 1989లో నరేష్, శ్రీ భారతి హీరో, హీరోయిన్లుగా సినిమా తీశారు జంధ్యాల.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -