Friday, May 10, 2024
- Advertisement -

నిద్రలో నుండి ఇప్పుడే లేచావా పవన్ బాబూ……షో అయిపోయిందిగా……ఇక పడుకోపో

- Advertisement -

చాలా మంది మనుషుల కంటే సినిమా హీరోలు కాస్త ఎక్కువ భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు. తెరపైన డూప్ హీరోయిజం చూపించడానికి అలవాటుపడిపోయి క్రమక్రమంగా అదే యాటిట్యూడ్‌ని రియల్ లైఫ్‌లో కూడా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు పవన్‌ చేస్తున్న రాజకీయంలో కూడా కనిపిస్తున్నది అదే. పవన్ మాట్లాడే ప్రతి మాటలోనూ జగన్‌ని టార్గెట్ చేయాలన్న తాపత్రయమే. చంద్రబాబు తప్పులను కాపాడాలన్న ఆలోచనే. అధికారంలో ఉన్నవాళ్ళను విమర్శించకుండా మరీ జగన్‌ని ఒక్కడినే తిడితే ప్రజలకు పవన్-బాబుల కుమ్మక్కు అర్థమైపోతుంది కాబట్టి చంద్రబాబు ప్రభుత్వ అధికారులను, ఆయన మంత్రులను విమర్శిస్తూ ఉంటాడు. చంద్రబాబుకు మాత్రం ఏమీ తెలిసి ఉండకపోవచ్చు అన్న ఇంప్రెషన్ ఇస్తూ ఉంటాడు. ఇది షరామామూలుగా చంద్రబాబు అనుసరించే వ్యూహమే. 2004లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉద్యోగులు పనిచేసింది అందుకే. కాకపోతే చంద్రబాబు మరీ స్ట్రిక్ట్‌గా వ్యవహరించబట్టే ఉద్యోగులు బాబుకు వ్యతిరేకంగా పనిచేశారని అబద్ధాలను ప్రచారం చేయడంలో ఎల్లో మీడియా సక్సెస్ అయింది. అక్కడ కూడా ఉద్యోగులను తక్కువ చేయడమే. చంద్రబాబు నైజమే అది. తాను తప్ప ఇంకెవ్వరూ పనిచేయలేదని అందరినీ తక్కువ చేస్తూ ఉంటాడు. విజయాలన్నింటినీ తన ఖాతాలో వేసుకుంటూ వైఫల్యాలను మాత్రం ఇతరుల పైన నెట్టేస్తూ ఉంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తుంది కూడా అదే. ఇలాంటి నీచ రాజకీయాల విషయాలను పక్కన పెడితే కనీసం ఆంధ్రప్రదేశ్‌కి జీవనాధారమైన ప్రత్యేక హోదా విషయంలో కూడా పవన్ కళ్యాణ్ నాటకాలు చూస్తుంటే ఆవేదన కలుగుతోంది.

ప్రత్యేక హోదా పేరు చెప్పి ఓట్లు దండుకున్నది టిడిపి, బిజెపిలు, వాళ్ళను గెలిపించడానికి, జగన్‌ని ఓడించడానికి ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఆ పాపంలో భాగమే. ప్రత్యేక హోదా ఇవ్వడం మాకే సాధ్యం అని బిజెపి చెప్పింది. ఐదేళ్ళు, పదేళ్ళు కాదు పదిహేనేళ్ళ పాటు ప్రత్యేక హోదా వచ్చేలా చేస్తా అని చెప్పి మోసం చంద్రబాబు. బాబు, మోడీలకు ఓటేయండి….ప్రత్యేక హోదా ఇస్తారు. ఎపిని అభివృద్ధి పథంలో దూసుకెళ్ళేలా చేస్తారు అని నమ్మించింది పవన్ కళ్యాణ్.

అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచీ కూడా హోదాకు మంగళం పాడడానికి అన్ని ప్రయత్నాలూ చేసింది వెంకయ్య, చంద్రబాబులే. పార్లమెంట్ సాక్షిగా బిజెపి, టిడిపి ఎంపిలు చెప్పిన అబద్ధాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఎన్నికల ముందు అంతా హోదా వస్తే ఎన్ని ఉపయోగాలు, ఎన్ని ఉద్యోగాలు అంటూ చెప్పి ప్రచారం మోత మోగించిన ఈనాడు, ఆంద్రజ్యోతిలు కూడా బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే హోదా వేస్ట్ అని బాబు పాటనే పాడి సీమాంధ్రులకు తీరని ద్రోహం చేశాయి. ఐదు కోట్ల ఆంద్రులను దారుణంగా వంచిస్తూ విభజన పాపాన్ని మించి సీమాంధ్రులను దగా చేశాయి. హోదా రాదు అని తెలిసినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం తీరిగ్గా తన సినిమాలు తాను చేసుకున్నాడు. రెండున్నరేళ్ళ తర్వాత ఆ మధ్య ఓ మూడు రోజుల పాటు షో చేసి మోడీ, చంద్రబాబులను వదిలేసి సైడ్ క్యారెక్టర్స్‌ని, కామెడీ క్యారెక్టర్స్‌ని నాలుగు మాటలు అని ఎంచక్కా తన సినిమా షూటింగ్‌లకు వెళ్ళిపోయాడు. అన్నింటికీ మించి మోడీ కంటే ఎక్కువ ఉత్సాహం చూపించి హోదాను నీరుగార్చడంతో పాటు మోడీకి కూడా సీమాంధ్రుల్లో వ్యతిరేకత రాకుండా సీమాంధ్రలకు ద్రోహం చేస్తూ కాపు కాసింది చంద్రబాబు. అలాంటి చంద్రబాబుతో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్న పవన్‌ని బాబుని విమర్శించే దమ్ములేకపోయింది. చంద్రబాబులానే, పవన్ కూడా ప్రత్యేక హోదా విషయంలో సీమాంధ్రులను దగా చేశాడు.

ఇప్పుడు కూడా మొదట తాను వ్యక్తిగతంగా పోరాడి ఆ తర్వాత రోడ్ల మీదకు వస్తానని సొల్లు కబుర్లు చెప్తున్నాడు. అసలు అధ్యయనం అంటూ పవన్ వినిపిస్తున్న మాటల వెనుక ఉన్న రాజకీయ కుట్ర ఒకటే. ఆల్రెడీ నాలుగేళ్ళు అయిపోవస్తోంది. ఇంకో ఆరునెలలు అధ్యయనం అంటూ టైం పాస్ చేస్తే ఆ తర్వాత ఎన్నికల నాటికి బిజెపి-టిడిపి విడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది కాబట్టి అప్పుడిక బాబు-పవన్‌లిద్దరూ ప్రత్యేక హోదా ఉద్యమం పేరు చెప్పి మరోసారి షో చేసి 2019లో కూడా ఓట్లు కొల్లగొడతారన్నమాట. అయినా హోదా కోసం పరకాల ప్రభాకర్ భార్యను రాజీనామా చేయమని అడుగుతున్న పవన్…..టిడిపి కేంద్రమంత్రులను ఎందుకు అడగడు? తన మంత్రుల చేత రాజీనామా చేయించమని చంద్రబాబును ఎందుకు నిలదీయడు?

ఇక ఇదే సందర్భంలో జగన్ గురించి కూడా చెప్పుకుందాం. 2014ఎన్నికల ముందు కూడా జగన్ చెప్పిన మాట ఒకటే. తనకు ఎంపి సీట్లు ఇవ్వండి. హోదా ఇచ్చిన వాళ్ళకే మద్దతు ఇస్తా. కాంగ్రెస్, బిజెపిలలో ఎవరైతే ఏముంది? ఎవరైతే హోదా ఇస్తారో వాళ్ళకే మద్దతిస్తా అని అన్నాడు. ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత హోదాకు మోడీ మంగళం పాడితే….చంద్రబాబు కూడా తన కేసుల నుంచి బయటపడడానికి ఐదు కోట్ల సీమాంధ్రుల ప్రయోజనాలను తాకట్టు పెడుతూ హోదా విషయంలో కుట్ర చేస్తే హోదా కోసం నిరాహారా దీక్షలు చేసింది, ధర్నాలు, బంద్‌లు, ఢిల్లీలో దీక్షలు చేసింది ఎవరు? పార్లమెంట్‌లో హోదా కోసం ప్రత్యేక చర్చ, తీర్మానాలు ప్రవేశపెట్టింది ఎవరు? ప్రత్యేక హోదా కోసం దేశంలో ఉన్న అందరు రాజకీయ నాయకులనూ కలిసింది ఎవరు? అన్ని రాజకీయ పార్టీల మద్ధతు, ప్రజల మద్ధతు, మరీ ముఖ్యంగా యువతరం మద్ధుతుతో అలుపులేని పోరాటం చేసింది ఎవరు? ఒక్క జగన్ మాత్రమే. అయినా ఏం లాభం? హోదా కోసం బంధ్‌కి పిలుపునిస్తే ఆ బంద్ అట్టర్‌ఫ్లాప్ అని టిడిపితో పాటు ఆ పార్టీ భజన మీడియా కూడా చెప్పేస్తుంది. జనాల్లో అస్సలు స్పందనే లేదని, హోదాను ఎవరూ కోరుకోవడం లేదని విషప్రచారం చేస్తారు. జగన్ నిరహార దీక్షకు కూర్చుంటే కనీస మానవత్వం కూడా చూపకుండా హేళన చేస్తారు. ఇక హోదాకు వ్యతిరేకంగా ఎన్ని చెప్పాలో, ఎన్ని చేయాలో అన్నీ చేసింది చంద్రబాబు, ఆయన భజన మీడియా. అన్నీ తెలిసి కూడా తన రాజకీయ కుమ్మక్కు పుణ్యమా అని దృతరాష్ట్రుడిలా కళ్ళు మూసుకున్నది పవన్. ఈ రోజు పవన్ కళ్యాణ్ వచ్చి హోదా కోసం జగన్ పోరాడాలని చెప్తూ ఉంటే …….ఇంత నిస్సిగ్గుగా నీచమైన రాజకీయాలు ఎలా చేస్తారా అని అనిపిస్తోంది? ఐదు కోట్ల సీమాంధ్రుల జీవితాలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎటుపోయినా ఫర్వాలేదు అధికారం మాత్రం తమ చేతుల్లోనే ఉండాలని కుట్రలు చేస్తున్న వీళ్ళ నిజనైజం ఆలోచనాపరులైన ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది. హోదా చుట్టూ బాబు, ఆయన భజన మీడియా, పవన్ ఆడుతున్న నాటకాలు ప్రజలకు తెలియలేదంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -