Tuesday, May 14, 2024
- Advertisement -

నక్కజిత్తుల తెలివితేటలు కాదు….. జర్నలిస్ట్ ప్రశ్నలకు ఆన్సర్ ఉందా?

- Advertisement -

పాపం పవన్ కళ్యాణ్ అని వీకెండ్ కామెంట్ రాసుకొచ్చిన రాధాకృష్ణ…….. చివరలో ఐ పిటీ హిమ్ అని కంక్లూజన్ ఇచ్చాడు. చంద్రబాబు, లోకేష్‌ల కోసమే జర్నలిస్ట్ జీవితాన్ని అంకితం చేసిన రాధాకృష్ణ ఇప్పుడు కూడా నారావారిపైన ఉన్న భక్తిని కాపాడుకుంటూ చంద్రబాబు, లోకేష్‌లు రాధాకృష్ణ, రవిప్రకాష్‌లతో కలిసి రచించిన కుట్ర వ్యూహాలను బయటపెట్టిన పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు, ప్రశ్నించాడు. ఏ విషయాన్ని తనకు అనుకూలంగా …… ఒక విషయాన్ని ప్రజలందరూ కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఆలోచించేలా చేయడం కోసమే జర్నలిజం సంస్థలు నడుపుతున్న రాధాకృష్ణ ఇప్పుడు కూడా అడ్డంగా…….. కనీస స్థాయి ఆధారాలు లేకుండా……..క ళ్ళ ముందు జరిగిన నిజాలను కూడా వక్రీకరిస్తూ తన స్టైల్‌లో అబద్ధపు రాతలు రాసేశాడు. చాలా సార్లు అడ్డంగా దొరికిపోయాడు. పేరాల కొద్దీ రాధాకృష్ణ రాసుకొచ్చిన అభూత కల్పనలు, అబద్ధాలను పక్కన పెడితే ఒకటి రెండు ప్రశ్నలను మాత్రం రాధాకృష్ణను అడగాలని ఉంది.

…. ఒకప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ కుటుంబాన్ని విమర్శించిన పవన్ కళ్యాణ్ హఠాత్తుగా కెసీఆర్‌ని కలిసి పొగడడం వెనుక కారణం ఏంటో ఆయనే చెప్తే బాగుంటుంది… అని రాధాకృష్ణ ప్రశ్నించాడు.

ఇదే ప్రశ్నకు రాధాకృష్ణ సమాధానం కూడా తెలుసుకోవాలని ఉంది. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత మొదటి మూడు నెలల కాలంలోనే మొత్తం తెలంగాణాను కెసీఆర్ సర్వనాశనం చేస్తున్నాడు అనే స్థాయిలో వార్తలు వండి వార్చారు రాధాకృష్ణ అండ్ కో. ఆ తర్వాత ఆంధ్రజ్యోతిని కెసీఆర్ నిషేధించాడు. ఇక ఆ తర్వాత కెసీఆర్‌తో రాధాకృష్ణ రాసుకుపూసుకు తిరిగిన వైనం తెలుగు ప్రజలతో పాటు రాజకీయ నాయకులను కూడా ఆశ్ఛర్యపరిచింది. ఏకంగా వెల్‌కమ్ అంటూ వెలమ-కమ్మ గ్రూప్ అంటూ కూడా ఏవేవో చెప్పుకొచ్చాడు రాధాకృష్ణ. కెసీఆర్‌పై యుద్ధం చేస్తా…..ఏదో చేస్తా అని రంకెలేసిన రాధాకృష్ణ సడన్‌గా కెసీఆర్‌కి ఆ స్థాయిలో జాన్ జిగిరి ఎందుకయినట్టు? తెర వెనుక ఏం జరిగిందో రాధాకృష్ణ చెప్తాడా?

……………….శ్రీరెడ్డి విషయంలో జగన్‌ని ఎందుకు అనుమానించడం లేదు పవన్ అని కూడా రాధాకృష్ణ ప్రశ్నించాడు. అదేమంటే శ్రీరెడ్డి స్వయంగా తన వెనుక జగన్ ఉన్నాడు అన్నట్టుగా ప్రస్తావించింది కదా అని లా పాయింట్ తీశాడు.

……………..ఈ తెలివితేటలనే ———–అంటారు రాధాకృష్ణ. రాజధానిలో పంటలు తగల బెట్టడం, తుని రైలు ఘటన….. ఇంకా ఎన్ని సంఘటనలను జగన్‌కి ఆపాదించాలని చూడలేదా? నిజంగా జగన్ కానీ జగన్ పార్టీ నాయకులు కానీ చేసి ఉండి ఉంటే చంద్రబాబు వదిలేవాడా? ఇప్పుడు శ్రీరెడ్డి ఇష్యూలో కూడా అదే కుట్ర. దమ్మున్న అని చెప్పుకోవడమే తప్ప ధైర్యంగా ఎదుర్కున్నది ఎప్పుడు?

………నిన్నటి వరకూ పవన్ కళ్యాణ్‌ని తిట్టిన, తీవ్రంగా విమర్శించిన జగన్‌ని పవన్ ఎందుకు ఏమీ అనడం లేదు అని కూడా రాధాకృష్ణ ప్రశ్నించాడు. అప్పటికి జగనేదో పవన్ కళ్యాణ్‌ని తీవ్రస్థాయిలో విమర్శించాడు అని ప్రజలను నమ్మించాలని చూశాడు. కానీ తెరవెనుక గరుడ పురాణాలు చెప్తే కొంతమంది అయినా నమ్ముతారేమో కానీ కళ్ళ ముందు జరిగినవాటిని కూడా అబద్ధాలతో మేనేజ్ చేస్తానంటే ఎలా రాధాకృష్ణా? 2014 ఎన్నికల ముందు నుంచీ ఇప్పటి వరకూ పవన్‌ని ఏ రోజైనా జగన్ తీవ్రస్థాయిలో విమర్శించాడా? అసలు పట్టించుకున్నాడా? చంద్రబాబు బంధం నుంచి బయటపడాలి అని పవన్‌కి చెప్పడం తప్ప పవన్‌పై జగన్ చేసిన వేరే విమర్శలు ఏంటో చెప్పగలవా రాధాకృష్ణా?

ఒకవైపు ఇదంతా గరుడ పురాణంలో భాగమే. బిజెపినే చేయిస్తోంది. జగన్-పవన్‌లు కలిసిపోయేలా చేస్తోంది అని చిత్తానికి వ్యాఖ్యలు చేసేశావ్. మళ్ళీ అదే వ్యాసంలోనే శ్రీరెడ్డి వెనకాల జగన్ కూడా ఉండొచ్చు కదా……జగనే చేయిస్తూ ఉండొచ్చు కదా అన్న అనుమానం నీ కామెంట్‌ని చదువుతున్నవాళ్ళకు కలిగించాలన్న ప్రయత్నం చేస్తావ్. ఇవి రెండూ పరస్పర విరుధ్దం కాదా? ఆపరేషన్ గరుడ పురాణం నిజమే అయితే పవన్ కళ్యాణ్‌ని డ్యామేజ్ చేసేలా జగన్ ఎందుకు వ్యూహ రచన చేస్తాడు అన్న కామన్‌సెన్స్ లేకుండా పోతే ఎలా సామీ?

ఇక చివరగా జర్నలిజం సంస్థను నడపడం ఎంత కష్టమో, అది ఎంత బాధ్యతో కూడా చెప్పాడు రాధాకృష్ణ. ఆయనను ఆయన దొరతనంలా ఫీలవ్వడం లేదట.

ఈ మాట మీకు మీరు చెప్పుకోవడం కాదు రాధాకృష్ణా. మీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం చూస్తూ ఉన్న వాళ్ళు చెప్పాలి. ఏరోజైనా ఏ అతిథిని అయినా గౌరవంగా సంబోధించడంలాంటివి చేశావా? గెస్ట్ ఎవరైనా కూడా మీరు మాట్లాడే పద్దతి, మీ ఆహార్యం అన్నీ కూడా మీ దొరతనాన్ని చెప్పకనే చెప్తున్న విషయం తెలుగు ప్రజలకు తెలియదా? అన్నింటికీ మించి మీడియా సంస్థను నడపడం చాలా పెద్ద బాధ్యత. ఎన్నో త్యాగాలు చెయ్యాలి. నిద్రలేని రాత్రులు గడపాలి. కానీ భజన మీడియా సంస్థను నడపడం చాలా తేలిక. కోటాను కోట్ల రూపాయలు అక్రమంగా వెనకేసుకోవడం, బ్లాక్ మెయిల్ చేయడం, రాజకీయ వ్యభిచార కార్యక్రమాలను అరేంజ్ చేయడం తెలిసి ఉంటే చాలు……….ఏమంటారు? మీ జర్నలిస్ట్ జీవితం మొత్తం చూస్తూ ఉంటే నాకు కూడా ఒక మాట చెప్పాలని ఉంది రాధాకృష్ణా…….ఒక జర్నలిస్ట్‌గా మీ జీవితం పట్ల ఐ పిటీ యు రాధాకృష్ణా.

ఈ నా కామెంట్ కఠినంగా ఉండాలనే రాసినది. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ గురించి మీ వీకెండ్ కామెంట్‌లో రాసిన ప్రతి అక్షరంలోనూ నాకు మీ దొరతనమే కనిపించింది. చివరలో ఐ పిటీ హిమ్ అని మీరు అన్నప్పుడు అయితే నా ఆలోచనల్లో రగిలిన ఆవేదన ఏంటో మీ ఊహలకే వదిలేస్తున్నా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -