Monday, May 6, 2024
- Advertisement -

పెళ్లికి ముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..!

- Advertisement -

ఒక కొత్త ఆరంభానికి తొలి మెట్టు పెళ్లి. కాబట్టి పెళ్లి చేసుకునే ముందు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇవి చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే భాగస్వాములతో అనవసరమైన మనస్పర్ధలను, అపోహలను దూరం చేస్తాయి. అందుకే ఇలాంటి గందరగోళం నివారించాలంటే కొన్ని నిర్ణయాల పట్ల మీరు చాలా స్పష్టంగా వుండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పరస్పర కెరీర్ లక్ష్యాలు అర్ధం చేసుకోవడం ఏ జంటకైనా పునాది లాంటిది. మీ భాగస్వామి లక్ష్యాన్ని అర్ధం చేసుకుని, తెలుసుకుంటే, వారిని మరింత బాగా అర్ధం చేసుకోగలుగుతారు. మీ భాగస్వామి నిజంగా పిల్లల్ని కనాలనుకుంటున్నారా లేక మీరు వారిని పెంచడానికి తగినంత పరిణతి చెందారా అన్నది మీరు తెలుసుకోవాలి. ఇలా అయితే, మీ కొత్త బంధం తెచ్చే కొత్త బాధ్యతలను మీరు మరింత చక్కగా అర్ధం చేసుకోగలుగుతారు.

మీకు పెళ్ళైతే మీరు ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో మీకు స్పష్టంగా తెలియాలి. మీ తల్లిదండ్రులకు దగ్గరగా వుండే మీ ఊళ్లోనో లేక మీ భాగస్వామి సౌకర్యంగా ఉండగలిగే చోట కానీ కావచ్చు. మీరు కులాంతర వివాహం చేసుకుంటుంటే, మీ భాగస్వామి పుట్టిన దగ్గరి నుంచి ఏమి అనుసరిస్తున్నారో అదే చేయనివ్వడం గురించి మీరు స్పష్టంగా వుండాలి. వారిలో ఇది మార్చడానికి మనకు హక్కు వుండదు, ఈ నిజం మీరు అంగీకరించగలిగితే మీరు ముందడుగు వేయవచ్చు.

Also Read: భోజనం మధ్యలో నీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇది చాలా పెద్ద విషయం. దీని గురించి మీరు మీ భాగస్వామితో చాలా స్పష్టంగా వుండాలి. కొంత మందికి తమ సొంత ఇల్లు ఏర్పరుచుకోవాలని వుంటుంది, మరి కొంత మంది అటూ ఇటూ తిరుగుతూ కొత్త స్థలాలు చూడాలనుకుంటారు. మీరిద్దరూ ఈ విషయంలో ఏకాభిప్రాయంతో లేకపోతే, దీని గురించి ఆలస్యం కాక ముందే మీ భాగస్వామితో చర్చించండి.

కేవలం ఇంటి పనుల గురించి మీరు పెళ్లి చేసుకోవడం లేదు కనుక, ఇది మీరు ఇద్దరూ ఖచ్చితంగా పెళ్లికి ముందే స్పష్టంగా తెచ్చుకోవాల్సిన విషయం. అది ఇద్దరికీ సమాన బాధ్యత. ఈ ఆలోచన మీకు నచ్చకపోతే, మీరు పెళ్లికి బదులు ఒక పని మనిషి కోసం వెతుక్కోవడం మంచిది !

Also Read: ఇలా చేస్తే.. ఖచ్చితంగా బ్రెయిన్ షార్ప్ అవుతోంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -