Friday, May 3, 2024
- Advertisement -

తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

- Advertisement -

పూర్వ కాలంలో తెల్లజుట్టు కేవలం ముసలివారికి మాత్రమే వచ్చేది. కానీ ఈ ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే లేకుండా అందరికీ వైట్ హెయిర్ వచ్చేస్తోంది. పొల్యూషన్, స్ట్రెస్, పౌషికాహారలోపం, షాంపూలు, హెరిడిటరీ ఇలా వైట్ హెయిర్ కు రకరకాల కారణాలు చెబుతున్నారు డాక్టర్లు.

వైట్ హెయిర్ వచ్చినవారు గార్నియర్, నాచురల్స్ అంటూ రకరకాల కలర్స్ వాడుతున్నారు. దీంతో అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే వైట్ హెయిర్ వచ్చిన తర్వాత జుట్టు గురించి శ్రధ్ద తీసుకునే కంటే రాకుండా తీసుకోవడం మంచిది. హెయిర్ స్పెషలిస్టులు చెప్పిన ఆ సింపుల్ చిట్కాలు మీ ముందుకు తీసుకొచ్చింది. నాలుగు స్పూన్ల గోరు వెచ్చటి కొబ్బరినూనెను తలకు పట్టించాలి. బాగా మసాజ్ చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే తెల్లజుట్టు రాకుండా తప్పించుకోవచ్చు.

మందార ఆకుల పేస్ట్ ను తలకు పట్టించి అర్ధగంట తర్వాత తలస్నానం చేస్తే వైట్ హెయిర్ రాకుండా ఉండడమే కాకుండా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. అలాగే మందార పువ్వులను ఎండబెట్టి ఆ పొడిని ఆల్ మండ్ ఆయిల్ తో కలిపి రాత్రి పూట తలకు అప్లై చేయాలి. ఉదయాన్నే హెడ్ బాత్ చేయడం వల్ల తెల్లబడ్డ జుట్టు కూడా క్రమేపి నల్లబడుతుందని హెయిర్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. శరీరంలో ఐరన్ తగ్గినా కూడా తెల్లజుట్టు వచ్చే అవకాశాలు ఉన్నందున ఖర్జూరం, బెల్లం వంటి పదార్థాలను తీసుకోవడం మంచిది.

మరి ఇంకెందుకు ఆలస్యం.. పైన చెప్పిన చిట్కాలు పాడించండి.. వైట్ హెయిర్ రాకుండా హ్యాపీగా ఉండండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -