Friday, April 19, 2024
- Advertisement -

అనువాద పాటల్లో వేటూరి వెన్నెల

- Advertisement -

వేటూరి పాటంటే వేల రాగాల పూదోట. ఆ కలం రాయని మాట లేదు.. పలికించని భావం లేదు. నేరుగా రాసిన తెలుగు పాటలే కాదు, అనువాద గీతాలనూ అద్భుతం అనిపించే రీతిలో ఆయన తన కలంలోనుంచి వెన్నెల కురిపించారు. ఆయన రాసిన ఐదు అనువాద గీతాలు ఇక్కడ..

కన్నానులే (బొంబాయి)
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘బొంబాయి’లో పాటలన్నీ వేటూరి కలం ద్వారా తెలుగు వారికి చేరువయ్యాయి. మరీ ముఖ్యంగా ఈ పాట. ఈ గీతం వినిపించని వేదిక లేదంటే అతిశయోక్తి కాదు. ‘అందం తొలికెరటం’, ‘ఊహల్లో తెల్లారే రేయి’, ‘నీ నమాజుల్లో ఓనమాలు మరిచా’ లాంటి భావాలు వేటూరికే చెల్లు.

వెన్నెలవే వెన్నెలవే (మెరుపు కలలు)
‘ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం’.. ఇలా రాసేది వేటూరి మాత్రమే! ప్రేమికుల తీపి జ్ఞాపకాల తోటలా సాగే ఈ పాటకు ఆయన తన మాటలతో పరిమళం అద్దారు.

శశివదనే శశివదనే(ఇద్దరు)
‘అచ్చొచ్చేటి వెన్నెల’, ‘శ్వేతాశ్వమ్ముల వాహనుడు’, ‘మదన మోహిని చూపులోన మాండురాగం’.. అనువాద గీతంలో​ ఇంత అచ్చమైన తెలుగు మాటలు వాడిన ఘనత వేటూరిదే! ఎన్ని సార్లు విన్నా తనివి తీరని పాట ఇది.

స్నేహితుడా.. స్నేహితుడా (సఖి)
పెళ్లి చేసుకున్న ప్రేమికుల మనసులో భావాలకు అద్దం పట్టేలా తన మాటలతో చమ్మక్కులద్దారు వేటూరి. పాతాళ భైరవి సినిమాలో పింగళి నాగేంద్రరావు గారి డైలాగును గుర్తు చేస్తూ ‘సేవలు శాయవలెగా’ అని రాయడం చూస్తే చప్పట్లు కొట్టకుండా ఉండలేం.

కడసారిది వీడ్కోలు (అమృత)
శ్రీలంక​లోని తమిళుల ఇబ్బందులను తెరపై ఆవిష్కరించే క్రమంలో​ సాగే పాట ఇది. దాన్ని తెలుగులో అనువదిస్తూ వేటూరి రాసిన పద్ధతి అజరామరం. ‘కన్నీటితో మా చేవ్రాలు’, ‘పాడే జోలలు పాపల ఏడ్పుల పాలు’, ‘జననానికి ఇది మా దేశం.. మరణానికి మరి ఏ దేశం’.. ఎంత వివరించినా మరికొంత మిగిలిపోయే లోతైన భావాలున్న పాట ఇది.

మాయాబజార్ సినిమాలో​.. భలే భలే టైటిల్స్!

నచ్చిన పాత్రలను మిస్ చేసుకున్న నటీనటులు..!

గుప్పెడన్ని సీన్లు.. చిరకాలం గురుతులు.

నవలల ఆధారంగా వచ్చిన చిరంజీవి సినిమాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -