Tuesday, May 14, 2024
- Advertisement -

వైసీపీ గెలుపులో ఈ టీం చేసిన పని గ్రేట్

- Advertisement -

వైసీపీ గెలుపు గాలివాటం కాదు.. జగన్ పాదయాత్ర.. ప్రజల్లోకి చొచ్చుకెళ్లిన తీరు.. ఆయన పార్టీ మేనిఫెస్టో నవరత్నాలతోపాటు దీనివెనుక ఎంతో మంది కృషి ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా, తెరవెనుక వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వందల మంది కృషి ఉంది. ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా టీడీపీ కుట్రలను చిత్తు చేసి ప్రజలకు వాస్తవాలు వివరించి జగన్ కు తోడుగా నిలిచి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు వైసీపీ సోషల్ మీడియా విభాగం హెడ్ దివ్యారెడ్డి.. వైసీపీ గెలుపులో ఆమె పాత్ర మరువలేనది.


*దివ్యారెడ్డీ కీరోల్
దివ్యారెడ్డి.. వైఎస్ఆర్ సీపీ అఫీషియల్ డిజిటల్ మీడియా హెడ్ (డీఎంవో). వైసీపీ విజయంలో సోషల్ మీడియా పాత్ర కాదనలేనిది. సోషల్ మీడియా ఈ ఎన్నికల్లో ఎంతో కీరోల్ పోషించింది. ఎప్పటికప్పుడు టీడీపీ ని టార్గెట్ చేసి నిజాలను ప్రజలకు చెబుతూ .. టీడీపీ అవినీతిని, అక్రమాలను అన్నింటిని ప్రజల ముందు సోషల్ మీడియా ఉంచింది. వైసీపీ ఒక తిరుగులేని శక్తిగా మారడానికి సోషల్ మీడియా కూడా ప్రధాన కారణం.. లోకేష్ , చంద్రబాబు యూటర్న్ లను, తప్పుడు మోసాలను ప్రజలకు తెలిపింది వైసీపీ సోషల్ మీడియా విభాగం. ఇదంతా ఒకే సమయంలో గురితప్పకుండా ఏకకాలంలో జరగడానికి కారణం దివ్యారెడ్డి. ఎంతో ఓర్పుతో.. క్రియేటివ్ ఐడియాస్ తో టీమ్ మేనేజ్ మెంట్ తో సక్సెస్ ఫుల్ గా లాస్ట్ మినట్ వరకు వైసీపీ కోసం ఫైట్ చేశారు. అది బాగా హెల్ప్ అయ్యింది. న్యూట్రల్ గా ఉన్న ఓటర్లు కూడా వైసీపీ సోషల్ మీడియా ప్రచారానికి టర్న్ అయ్యారు. టీడీపీకి వ్యతిరేకంగా.. వైసీపీకి అనుకూలంగా మారారు.

*జగన్ గెలుపులో దివ్యారెడ్డి కృషి
జగన్ గెలుపు వ్యూహాలను రచించడంలో దేశంలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఏపీ రాజకీయ, సామాజిక సమీకరణాలను పసిగట్టి అందుకు అనుగుణంగా అమలు చేశారు. కానీ ప్రశాంత్ కిషోర్ హిందీ వాసి.. అయనకు తెలుగు రాదు.. అదే సమయంలో ఇక్కడి వారి మెంటాల్టీ, ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నంలో పీకే టీంను అన్నీ తానై వ్యవహరించారు వైసీపీ సోషల్ మీడియా విభాగం హెడ్ (డీఎంవో) దివ్యారెడ్డి. ప్రశాంత్ కిషోర్ కు ఎక్కువ సమాచారం అందించి వారు చాకచక్యంగా చురుకుగా పనిచేయడంలో గెలుపు వ్యూహాలు రచించడంలో దివ్యారెడ్డి టీం కీలక పాత్ర పోషించింది. రైట్ కంటెంట్ ను అందిస్తూ దాన్ని ప్రచారం చేస్తూ ప్రజలకు వైసీపీ చేరువైందంటే దానికి పీకే టీం, దివ్యారెడ్డి కృషియే కారణం. రాయలసీమ, ఉత్తర, దక్షిణ, కోస్తా ఆంధ్రాలో ప్రాంతీయ రాజకీయ, కుల సమీకరణాలు, ఎన్నికల వ్యూహాలను దివ్యారెడ్డి టీం సేకరించి పీకే కు ఇస్తే వారు చాకచక్యంగా వ్యూహాలు రూపొందించి అమలు చేశారు. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పీకే టీంకు కంటెంట్ ను ఇస్తూ దివ్యారెడ్డి టీం పీకే టీంకు సపోర్టుగా నిలవడంతో వైసీపీ గెలుపు సాధ్యమైంది.

*ఇక సోషల్ మీడియా ఎఫెక్ట్ బూత్ లెవల్ వరకూ..
ఇక దివ్యారెడ్డి, పీకే టీంలు వైసీపీ ప్రచారాన్ని బూత్ లెవల్ వరకూ తీసుకెళ్లారు. వేలాది వాట్సాప్ గ్రూపులను యాడ్ చేసి వైసీపీ కార్యకర్తలను, ప్రజలను అందులో పెట్టి వైసీపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఏసీ, పీసీల స్థాయిలో నాయకులను పెట్టి ప్రజల సమస్యలు లేవనెత్తగానే పరిష్కారం అయ్యేలా గ్రూపుల్లో చొరవ చూపారు. ఆ కష్టం.. పలితం ఎన్నికల వేళ వైసీపీకి ఓట్ల వాన కురిపించింది. వైసీపీ విజయానికి ఈ బూత్ లెవల్ ప్రచారం కూడా దోహదపడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -