Saturday, May 4, 2024
- Advertisement -

వైఎస్‌ జగన్‌ ఆరోగ్య రహస్యం ఇదే..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరుదైన మైలురాయిని అందుకున్నారు. ఆయన నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర ఇవాళ్టీకి 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. 269వ రోజు పాదయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

269 రోజులు.. 116 నియోజకవర్గాలు.. 106 బహిరంగ సభలు..11 జిల్లాల మీదుగా సాగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. అలుపెరుగ‌ని పోరాట యోధుడిలా ప్ర‌జ‌ల‌కోసం ఆరోగ్యాన్ని లెక్క చేయ‌కుండా పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు.అయితే జ‌గ‌న్ ఆరోగ్య‌ర‌హ‌స్యం ఏంట‌నేది సంచ‌ల‌నంగా మారింది.

మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాత్ర కొనసాగడం వెనుక ఆయన ఆరోగ్యమే కీలక పాత్ర పోషిస్తోంది. వైఎస్ జగన్ పాదయాత్ర నిర్విరామంగా యాత్ర కొనసాగించడానికి ఆయన తీసుకొనే ఆహరపు అలవాట్లు కూడ వైఎస్ జగన్ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. ఏ రోజు కూడ షెడ్యూల్ మిస్ కాకుండా జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నాడు.

రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా.. ఉదయం మాత్రం తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్ర లేస్తారు. గంట పాటు వ్యాయామం.. కాలకృత్యాలనంతరం ఆరున్నర.. ఏడు గంటల వరకు పత్రికా పఠనం. ఆ తర్వాత ముఖ్యులతో ఫోన్‌ సంభాషణ. అనంతరం ఉదయం ఏడు.. ఏడున్నర గంటలకు పార్టీ ప్రముఖులు, ఇతర ముఖ్యులతో భేటీఅవుతారు.

పాదయాత్ర ఎక్కడ ప్రారంభం అవుతోంది…పాదయాత్ర ఎక్కడ ముగుస్తోందనే విషయమై స్థానిక నాయకులతో చర్చిస్తారు.ఆ తర్వాత పాదయాత్రకు రెడీ అవుతారు. ప్రతి రోజూ ఉదయం పూట కేవలం గ్లాస్ జ్యూస్ మాత్రమే బ్రేక్‌ఫాస్ట్‌గా జగన్ తీసుకొంటారు. షెడ్యూల్ ప్రకారంగానే జగన్ యాత్రను ప్రారంభించేలా ప్లాన్ చేసుకొంటారు. మధ్యాహ్నం మాత్రం కొన్ని పండ్లు, కప్పు పెరుగు మాత్రమే ఆహారంగా తీసుకొంటారు. రాత్రి పూట రెండు పుల్కాలు, పప్పు, మరో కూరతో భోజనం ముగిస్తారు. రాత్రి పడుకోబోయే ముందు కప్పు పాలు తాగుతారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -