Saturday, May 11, 2024
- Advertisement -

వైసీపీ వెబ్‌సైట్స్‌ వ‌ర్సెస్‌ టీడీపీ వెబ్‌సైట్స్‌..

- Advertisement -

ఏపీలో ప్ర‌ధానంగా అధికార పార్టీ టీడీపీ….ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ మ‌ధ్యే రాజ‌కీయ పోరు జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం చేప‌ట్టాల‌ని జ‌గ‌న్‌..మ‌రో సారి అధికారంలోకి రావాల‌ని టీడీపీలు ప‌ట్టుద‌ళ‌తో ఉన్నాయి. అధికారం కోసం రెండు పార్టీల మ‌ధ్య పోరు అనేది సాదార‌ణం. కాని రెండు పార్టీల మ‌ధ్య పోరు కంటె అనుకూల‌…వ్య‌తిరే వెబ్‌సైట్‌ల మ‌ధ్య వార్ ముమ్మ‌రంగా న‌డుస్తోంది. దీనికి తోడు రెండు పార్టీల మ‌ధ్య సోషియ‌ల్ మీడియా వార్ భ‌యంక‌రంగా న‌డుస్తోంది. కొన్ని వెబ్‌సైట్లు అధికార పార్టీకి అనుకూలంగా ప‌నిచేస్తె…..మ‌రి కొన్ని వెబ్‌సైట్లు ప్ర‌తిప‌క్ష వైసీపీకి అనుకూలంగా ప‌నిచేస్తున్నాయి. ఇప్ప‌టికె వెబ్ సైట్లు మ‌ధ్య విభ‌జ‌న జ‌రిగింది. గ‌తంలో పార్టీల‌కు ఎలాంటి ప్ర‌మోష‌న్ ఉండేదో ఒక సారి చూద్దాం.

గ‌తంలో ప‌త్రిక‌లు ప్రాధాన పాత్ర‌పోషించేవి. రాజ‌కీయ ప్ర‌చారానికి ప్ర‌ధానంగా ప్రింట్ మీడియానె ఆధారం. అప్ప‌ట్లో ప‌త్రిక‌లు అన్ని పార్టీల‌కు స‌మానంగా ప్రాధాన్య‌త ఇచ్చేవి. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన త‌ర్వాత ఈనాడు అధిక ప్రాధాన్యం ఇచ్చింది.1983లో తెలుగు దేశం పార్టీ అధినేత రామారావు అధికారంలోకి రావడంలో ఈనాడు ప్రముఖ పాత్ర పోషించింది. రామారావు పర్యటనలకు, ప్రకటనలకు విస్తృత ప్రచారం కల్పించిన సంగ‌తి తెలిసందే.

అంత వ‌ర‌కు ప‌త్రిక‌లు ప్ర‌ధాన పాత్ర పోషించాయి. కాని 2004లో టీవీ9 మొద‌టిసారిగా 24 గంట‌ల న్యూస్ ఛాన‌ల్‌ను ప్రారంభించింది. అప్ప‌టి నుంచి ఎల‌క్ట్రానిక్ హ‌వా కొన‌సాగుతోంది. త‌ర్వాత ఛాన‌ల్ల‌లో కూడా రాజ‌కీయాలు ప్ర‌వేశించి బ్ర‌ష్టు ప‌ట్టించాయి. దీంతో వార్తా ఛాన‌ల్లు కూడా పార్టీల వైపే మొగ్గుచూపాయి. ఏ పార్టీల‌కు ఏఛాన‌ల్లు ప‌నిచేస్తున్నాయ‌నె సంగ‌తి ప్ర‌తీ ఒక్క‌రికి తెలిసిందే.

కాని ఇప్పుడు వెబ్‌సైట్‌ల హ‌వా కొన‌సాగుతోంది. ఎల‌క్ట్రానిక్ మీడియాతో పాటు వెబ్‌సైట్లు పార్టీల‌కు ప్ర‌చారం చేయ‌డంలో మునిగిపోయాయి. ఇప్ప‌టికె టీడీపీ వెబ్‌సైట్లు….వైసీపీ వెబ్‌సైట్లు అని విభ‌జ‌న జ‌రిగిపోయింద‌ని తెలుస్తోంది. పార్టీల మ‌ధ్య న‌డుస్తున్న వార్ కంటె ఈ వెబ్‌సైట్ల మ‌ధ్య నె భ‌యంక‌ర‌మైన వార్ న‌డుస్తోంది.

వీటికి తోడు సాషియ‌ల్ మీడియా తోడ‌య్యింది. ప్ర‌ధానంగా ఫేస్‌బుక్‌,ట్విట్ట‌ర్‌, వాట్స‌ప్‌, గూగుల్‌ప్ల‌స్‌, ఇన‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్య‌మాలు రాజ‌కీయాల‌కు వేదిక‌ల‌య్యాయి. ప్ర‌ధానంగా వైసీపీ, టీడీపీ అభిమానులు సోషియ‌ల్ మీడియాను ఉప‌యేగించుకొంటున్నారు. ఇక రాజ‌కీయ పార్టీలు కూడా వాటికె అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నాయి. అభిమానుల మ‌ధ్య ఈ వార్ ఎంత వ‌ర‌కు పోయిందంటె కుటుంబాల‌నుకూడా ఇందులోకి లాగుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -