Friday, March 29, 2024
- Advertisement -

ఒలింపిక్స్‌ ఆటగాళ్లకు మొదటి టీకా..!

- Advertisement -

టోక్యో ఒలింపిక్స్‌కు ఇప్పటికే అర్హత సాధించిన, బెర్తు సంపాదించే అవకాశం ఉన్న అథ్లెట్లకు కొవిడ్‌ టీకాలో తొలి ప్రాధాన్యం దక్కేలా చూస్తామని క్రీడల మంత్రి కిరన్‌ రిజిజు అన్నారు. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌ ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా అర్హత పోటీలు జరగాల్సి ఉందని ఆయన చెప్పారు.

అయితే ఒలింపిక్స్​ అర్హత పోటీలను వీలైనంత త్వరగా నిర్వహించాలని జాతీయ క్రీడా సంఘాలను, భారత ఒలింపిక్​ సంఘానికి కిరన్​ రిజిజు సూచించారు. “ఒలింపిక్స్‌ అర్హత పోటీలు వీలైనంత త్వరగా జరగాలి. అన్ని జాతీయ క్రీడా సంఘాలకు, భారత ఒలింపిక్‌ సంఘానికి ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించాం. కరోనా నిబంధనలను పాటిస్తూనే ఈ ఈవెంట్లు చేయాల్సి ఉంది. అంతర్జాతీయ టోర్నీలకు భారత్‌ ఆతిథ్యం ఇచ్చినప్పుడు విదేశీ ఆటగాళ్లు 14 రోజుల క్వారంటైన్‌లో ఉండటానికి సిద్ధపడకపోవచ్చు” అని రిజిజు పేర్కొన్నారు.

టాలీవుడ్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ ఇవే..!

నటి ప్రియ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -