ఆసీస్‌కు దిమ్మ‌తిరిగి పోయిందిగా!

- Advertisement -

చివ‌రికంటా ఉత్కంఠ రేపిన సిడ్నీ టెస్టును టీమిండియా డ్రాగా ముగించింది. సోమ‌వారం నాటి మూడో టెస్టు ఆఖ‌రిరోజున తెలుగు కుర్రాడు హనుమ విహారి నెమ్మ‌దైన ఇన్నింగ్స్‌తో ఓట‌మి నుంచి త‌ప్పించుకుని ఆసీస్‌కు షాకిచ్చింది. 407 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన భార‌త్‌.. ఐదు వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది. నాలుగో సెష‌న్ ముగియ‌డంతో ఆసీస్‌- భార‌త్ మ‌ధ్య మ్యాచ్ డ్రా అయ్యింది. విహారి ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేయ‌గా.. అశ్విన్ 128 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేసి ఆక‌ట్టుకున్నాడు.

కాగా ఆసీస్ విధించిన టార్గెట్‌ను ఛేదించే క్ర‌మంలో… భార‌త్ 98/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్లు శుభ్‌మ‌న్ గిల్‌, రోహిత్ శ‌ర్మ ఆదివారం అవుట్ కాగా.. ర‌హానే, పుజారా నేడు ఇన్నింగ్్స ఆరంభించారు. అయితే కెప్టెన్ ర‌హానే త్వ‌ర‌గానే పెవిలియ‌న్‌కు చేర‌డంతో వికెట్ కీప‌ర్ బ్యాట్్స‌మెన్ రిష‌భ్ పంత్ క్రీజులోకి వ‌చ్చాడు‌. ఈ క్ర‌మంలో త‌న‌కు ల‌భించిన రెండు లైఫ్‌లను స‌ద్వినియోగం చేసుకున్న పంత్‌.. దూకుడుగా ఆడుతూఅర్థ‌ సెంచరీ పూర్తి చేసుకుని‌.. సెంచరీ దిశ‌గా ప‌య‌నించాడు.

- Advertisement -

అయితే 97 పరుగుల వ‌ద్ద అవుట్ అయి శతకం చేసే అవ‌కాశం కోల్పోయాడు. పుజారా 205 బంతుల్లో 12 ఫోర్లతో 77 పరుగులతో మెరుగ్గా రాణించాడు. ఆసీస్ బౌల‌ర్లు హాజిల్‌వుడ్‌, లియోన్ రెండేసి వికెట్లు తీయ‌గా… కమిన్్స రోహిత్ శ‌ర్మ వికెట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. కాగా 4 మ్యాచ్‌ల‌ టెస్టు సిరీస్‌లో ఆసీస్ మొద‌టిది గెలవగా, బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా విజ‌యం సాధించింది. ఇప్పుడు మూడో టెస్టు డ్రాగా ముగియడంతో జనవరి 15 నుంచి బ్రిస్బేన్‌ వేదికగా జ‌రిగే నాల్గో టెస్టులో ఎవ‌రు గెలుస్తున్నార‌న్న.

టీమిండియాకు క్రికెట్ ఆస్ట్రేలియా సారీ

రౌడీ బిహేవియ‌ర్‌.. కోహ్లి ఫైర్‌

జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు చేదు అనుభ‌వం

నోరు పారేసుకున్న వార్న్.. మ‌రీ ఇంత నీచ‌మా!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...