- Advertisement -

టీమిండియాలో మొద‌లైన ప్ర‌క్షాల‌న‌….సిబ్బందిపై వేటువేసిన బీసీసీ

- Advertisement -

పంచకప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలవ్వడం జ‌ట్టుపై తీవ్ర ప్ర‌భావం చూపింది. టీమిండియాపైభిన్నంగా స్పందిస్తున్నారు అభిమానులు. అయితే టీమిండి ఓట‌మిని బీసీసీఐ సీరియ‌స్ గా తీసుకుంది. జ‌ట్టులో ప్ర‌క్షాల‌న మొద‌లు పెట్టింది.

టీమిండియా ఓట‌మిపాల‌వ‌డంతో జట్టు సహాయక సిబ్బందిపైనా ఆ ప్రభావం పడుతోంది .భారత జట్టు గనుక ఫైనల్ చేరి క‌ప్ గెలిచింటే ఈ ప్ర‌భావం ఉండేది కాదు. న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో పరిస్థితి మారిపోయింది. తొలిగా, టీమిండియా ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్ ను సాగనంపారు.

ఫర్హార్ట్ నాలుగేళ్ల కాలపరిమితి ఈ వరల్డ్ కప్ తో ముగిసింది. మామూలుగా అయితే కాలపరిమితిని పొడిగించే అవకాశం బీసీసీఐ పాలకవర్గానికి ఉంటుంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో మార్పులు చేసేందుకు బోర్డు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఫర్హార్ట్ స్పందిస్తూ, టీమిండియాతో తన కాంట్రాక్టు ముగిసిందని, చివరిరోజున తాను కోరుకున్న ఫలితం రాలేదంటూ విచారం వ్యక్తం చేశాడు.

టీమిండియాలో మార్పుల పర్వం ఫర్హార్ట్ తో మొదలైందని చెప్పాలి. కోచ్ గా రవిశాస్త్రి పనితీరుపైనా బోర్డు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవిశాస్త్రి కూడా ఇకమీదట కోచ్ గా కొనసాగేందుకు అంగీకరించకపోవచ్చు. ఇంకా ఎంత‌మందికి ఉద్వాస‌న ప‌లుకుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -