Friday, May 3, 2024
- Advertisement -

స‌మ‌రానికి ముందె ఆసిస్‌కు భారీ ఎదురుదెబ్బ‌….

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ ముంగిట ఆసిస్‌కు పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్న‌ర్ జ‌ట్టుకు దూర‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వార్నర్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడ్డాడు. దీంతో అతను శ్రీలకంతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌ ఆడలేదు. బుధవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో కూడా పాల్గొనలేదు. అత‌నికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హింగా అత‌ను అన్ ఫిట్ అని తేలిన‌ట్లు స‌మాచారం. రేపు ఆప్ఘ‌తో జ‌రిగే మ్యాచ్‌కు దూర‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

వార్నర్‌ కుడితొంటిలో గాయమైందని, దాని నొప్పి కారణంగా వార్నర్‌ ఇబ్బంది పడుతున్నాడని ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ మీడియాకు తెలిపాడు. వార్నర్‌​ టోర్నీలో 15 మంది ఆటగాళ్లకు అవకాశం రావాలని కోరుకుంటాడని జస్టిన్‌ చెప్పుకొచ్చాడు. అత‌ని స్థానంలో ఎవ‌ర్ని తీసుకోవాలో ఆలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు.

శ్రీలంకతో జరిగిన వార్మాప్‌ మ్యాచ్‌లో వార్నర్‌ గైర్హాజరితో ఉస్మాన్‌ ఖవాజా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. బాల్‌ట్యాంపరింగ్‌ వివాదంతో ఏడాది పాటు నిషేదం ఎదుర్కొన్న వార్నర్‌.. ఐపీఎల్‌తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. శ‌నివారం ఆప్ఘ‌న్ మ్యాచ్‌తో అంత‌ర్జాయంగా ఆరంగ్రేటం చేద్దామ‌నుకున్న వార్న‌ర్‌కు నిరాశె ఎదుర‌య్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -