బుమ్రా నాల్గో టెస్టుకు దూరం..

- Advertisement -

టీమిండియాను గాయాల బెడ‌ద వేధిస్తోంది. స్టార్ బౌల‌ర్లు మ‌హ్మ‌ద్ ష‌మీ, ఉమేష్ యాద‌వ్‌తో పాటు బ్యాట్స‌మెన్ కేఎల్ రాహుల్ గాయాల బారిన ప‌డి ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న నుంచి భార‌త్‌కు తిరిగి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆల్‌రౌండ‌ర్ జ‌డేజాకు కూడా గాయ‌మైంది. వీరి గైర్హాజ‌రీలో బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్ మెరుగ్గా రాణించి టీమిండియా బౌలింగ్ విభాగంలో స‌త్తా చాటారు. ఈ యువ ఆట‌గాళ్ల‌కు అశ్విన్ వంటి సీనియ‌ర్ ఆట‌గాడి అనుభ‌వం కూడా తోడు కావ‌డంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ సిరీస్‌లో ఆది నుంచి అద్భుతంగా ఆడిన బుమ్రా ఇప్పుడు జ‌ట్టుకు దూరం కావ‌డంతో భారీ షాక్ త‌గిలిన‌ట్ల‌యింది.

పొత్తి కడుపు నొప్పి కారణంగా అత‌డు సిరీస్‌లో మిగిలి ఉన్న నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. దాంతో టీమిండియా క్యాంప్‌లో ఆందోళన మొద‌లైంది. అయితే.. ఈ సిరీస్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన‌ సైనీ, సిరాజ్‌‌ల‌తో పాటు.. , శార్దూల్‌ ఠాకూర్‌, న‌ట‌రాజన్‌లు కూడా పేస్‌ బౌలింగ్‌లో ఇప్పటికే నిరూపించుకోవడం కాస్త ఊర‌ట క‌లిగించే అంశం. జడేజా స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌, బుమ్రా స్థానంలో నటరాజన్‌లు తుది జట్టులో ఉండే అవకాశం క‌నిపిస్తోంది.

- Advertisement -

కాగా బ్రిస్బేన్‌లో జ‌న‌వ‌రి 15 నుంచి చివరిదైన నాల్గో టెస్టు మొద‌లుకానుంది. ఇందులో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవ‌సం చేసుకుంటుంది. ఇప్పటివరకూ మూడు టెస్టులు జరగ్గా, 1-1తో ఇరు జట్లు స‌మంగా ఉన్నాయి. మూడో టెస్టు డ్రాగా ముగిసింది.

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌కు మ‌రోసారి చుక్కెదురు!

కేటీఆర్ కేబినెట్‌లో ప‌ద‌వుల కోసం లొల్లి!

గ్లామర్‌ డోస్‌ పెంచిన శ్రీరెడ్డి.. ఏకంగా ప్యాంట్‌ విప్పి..

సొంత విమనాలు ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News