Thursday, April 25, 2024
- Advertisement -

ఎదురులేని టీమిండియా…. కివీస్ గ‌డ్డ‌పై వ‌న్డే సీరీస్ కైవ‌సం

- Advertisement -

టీమిండియా జైత్ర‌యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా ఇంకా రెండు వ‌న్డేలు మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను కౌవ‌సం చేసుకుంది. మూడో వన్డేలో 244 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోహ్లీసేన సునాయాసంగా టార్గెట్ ఛేదించింది. మరో 7 ఓవర్లు మిగిలి ఉండగానే… లక్ష్యాన్ని ఛేదించింది.

రోహిత్‌ శర్మ(62; 77 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి(60; 74 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌)లు భారత్‌ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు.ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లు ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. ధావన్‌ బౌండరీలతో స్కోరును పరుగులు పెట్టించాడు. కాగా, జట్టు స్కోరు 39 పరుగుల వద్ద ఉండగా ధావన్‌(28; 27 బంతుల్లో 6 ఫోర్లు) బౌల్ట్ బౌలింగ్‌లో ధావన్… టేలర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అనంత‌రం రోహిత్‌, కోహ్లీలు హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. 113 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత రోహిత్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. కాసేపటికి కోహ్లి కూడా ఔట్‌ కావడంతో భారత్‌ జట్టు 168 పరుగుల మూడో వికెట్ రూపంలో వెనుదిరిగారు. చివ‌ర‌లో రాయుడు 42 బంతుల్లో 40 నాటౌట్‌, దినేష్ కార్తిక్ 38 బంతుల్లో 38 పుగులు చేసి విజ‌యాన్ని అందించారు.

అంత‌కు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకున్న న్యూజిలాండ్ 243 పరుగుల‌కు ఆలౌట్ అయ్యింది. (93;106 బంతుల్లో 9 ఫోర్లు), టామ్‌ లాథమ్‌(51; 64 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌) ఆకట్టుకోవడంతో న్యూజిలాండ్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్లు సాధించగా, హార్దిక్‌ పాండ్యా, చహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు తలో రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య నాల్గో వన్డే గురువారం జరుగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -