- Advertisement -

ఊపిరి పీల్చుకున్న టీమిండియా.. ఆఫ్‌సెంచ‌రీ చేసిన విలియమ్సన్ ఔట్‌

- Advertisement -

మాంచెస్ట‌ర్‌లో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న సెమీఫైన‌ల్లో భార‌త బౌల‌ర్ల జోరు కొన‌సాగుతోంది. మొద‌టి ఓవ‌ర్ నుంచి క‌ట్టుదిట్ట‌మైన బంతులు వేయ‌డంతో భారీ స్కోరు చేయ‌కుండా కీవీస్‌ను అడ్డుకున్నారు. త‌న మూడో వికెట్ ను న్యూజిలాండ్ కోల్పోయింది.

అర్ధశతకం సాధించిన కేన్‌ విలియమ్సన్‌ (67; 95 బంతుల్లో 6×4) ఔటయ్యాడు. చాహల్‌ వేసిన 35.2వ బంతి అతడి బ్యాట్‌ అంచుకు తాకి జడేజా చేతుల్లో పడింది. దీంతో భార‌త్ ఊపిరి పీల్చుకుంది. ప్ర‌స్తుతం 38 ఓవ‌ర్ల‌కు మూడు వికెట్లు కోల్పోయి 149 ప‌రుగులు చేసింది. క్రీజ్‌లో జేమ్స్ నీషమ్, రాస్ టేలర్‌లు క్రీజులో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -