Sunday, May 5, 2024
- Advertisement -

నేడే సఫారీలతో రెండో టీ20…కుర్రాల్లకు కఠిన పరీక్ష

- Advertisement -

దక్షిణాఫ్రికాతో ఈరోజు రాత్రి 7 గంటలకి రెండో టీ20 మ్యాచ్ ప్రారంభంకానుంది. వర్షం కారణంగా గత ఆదివారం ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో నేడు మొహాలి వేదికగా జరగనున్న రెండో టీ20పై అందరి చూపు నిలిచింది.వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో వీలైనంత త్వరగా సత్తా నిరూపించుకోవాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులోని కుర్రాళ్లని ఆదేశించాడు.

ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ కాస్తా.. రెండు టీ20ల సిరీస్‌గా మారడంతో.. ఈరోజు కూడా వర్షం వస్తే..? పరిస్థితి ఏంటి..? అని భారత్ జట్టులోని యువ క్రికెటర్లు కంగారు పడుతున్నారు.మొహాలి వేదికగా ఈరోజు రాత్రి 7 గంటలకి రెండో టీ20 మ్యాచ్ ప్రారంభంకానుండగా.. వర్షం పడే సూచనలు ఏమీ లేవు అని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో.. 40 ఓవర్ల మ్యాచ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రధానంగా అందరి చూపు ఇప్పుడు పంత్ పైనె పడింది.ఈ టీ20 సిరీస్‌లో అతను విఫలమైతే.. తన స్థానాన్ని ఇషాన్ కిషన్ లేదా సంజు శాంసన్‌‌కి వదులుకోవాల్సి వస్తుంది. నాలుగేళ్ల తర్వాత భారత్ పర్యటనకి వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు విజయంతో టూర్‌ని ఆరంభించాలని ఆశిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకూ భారత్‌తో ఆడిన అన్ని టీ20 మ్యాచ్‌ల్లోనూ సఫారీలు గెలుపొందారు. మరో సారి అదే జోరును కొనసాగించాలని సఫారీలు భావిస్తుండగా…టీమిండియా వారి షాక్ ఇవ్వాలని ఉవ్వీల్లూరుతోంది.ఏబీ డివిలియర్స్, హసీమ్ ఆమ్లా రిటైర్మెంట్‌తో ఢీలాపడిన సఫారీలు ఏ మేరకు కోహ్లీసేనకి పోటీనిస్తారో..? చూడాలి. ఆ జట్టు కొత్త కెప్టెన్ డికాక్‌ నాయకత్వంలో మొదటి టీ20 ఆడబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -