Saturday, May 4, 2024
- Advertisement -

భారత్ ను దెబ్బ తీసిన విండీస్ భారీ కాయుడు..

- Advertisement -

విండీస్‌ భారీకాయుడు రకీమ్‌ కార్న్‌వాల్‌ అరంగేట్రంలోనె ఆకట్టుకున్నాడు. జమైకా వేదికగా శుక్రవారం రాత్రి ఆరంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా వికెట్ పడగొట్టిన రకీమ్.. స్లిప్‌లో రెండు అద్భుతమైన క్యాచ్‌లను అందుకొని భారత్ ను దెబ్బకొట్టాడు.

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ వార్విక్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ (133-139 కిలోలు) రికార్డును బద్దలు కొడుతూ టెస్టు క్రికెట్‌ ఆడిన అత్యంత బరువైన క్రికెటర్‌గా నిలిచాడు. 6.6 అడుగుల ఈ ఆఫ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌ బరువు 140 కిలోలు.కమిన్స్‌ స్థానంతో అతడు వెస్టిండీస్‌ తుది జట్టులో స్థానం సంపాదించాడు.

తన స్పిన్ బౌలింగ్‌తో కెప్టెన్ విరాట్ కోహ్లీని సైతం కాసేపు ఇబ్బందిపెట్టిన ఈ 140 కిలోల భారీ క్రికెటర్.. ఒకానొక దశలో వికెట్ల ముందు కోహ్లీని దొరకబుచ్చుకునేలా కనిపించాడు.టెస్టు క్రికెట్‌‌లో ఆడిన అత్యంత బరువైన క్రికెటర్‌గా సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.

భారీ సిక్స్‌లు కొట్టగల కార్న్‌వాల్‌.. ఇటీవలి కాలంలో విండీస్‌ దేశవాళీ క్రికెట్లో చాలా నిలకడగా రాణించాడు. 2018-19 వెస్టిండీస్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 17.68 సగటుతో 54 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 55 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 260 పడగొట్టిన కార్న్‌వాల్‌.. 2224 పరుగులు సాధించాడు.

టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా పేరొందని పుజారా (6: 25 బంతుల్లో) .. కార్న్‌వాల్ విసిరిన బంతిని కట్ షాట్‌తో పాయింట్‌ దిశగా తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ.. బంతి నేరుగా వెళ్లి ఫీల్డర్ బ్రూక్స్ చేతుల్లో పడింది.అంతర్జాతీయ క్రికెట్‌లో కార్న్‌వాల్‌కి ఇదే తొలి వికెట్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -