Tuesday, May 14, 2024
- Advertisement -

టెస్టుల్లో ఆసిస్ మాజీ కెప్టెన్ పాంటింగ్ రికార్డును సమయం చేయనున్న కోహ్లీ..

- Advertisement -

విండీస్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ జోరుమీదున్నారు. వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన కోహ్లీ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే ఎవరికి సాధ్యం కాని పలు రికార్డులను నెలకొల్పాడు. తాజాగా వెస్టిండీస్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో కోహ్లి మరో అరుదైన రికార్డుపై గురిపెట్టాడు. ఈ సిరీస్ లో సెంచరీ సాధిస్తే ఆసిస్ మాజీ కెప్టెన్ పాటింగ్ రికార్డును సమయం చేయనున్నారు.

టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన సారథిగా పాంటింగ్‌(19) రికార్డును కోహ్లి సరి చేస్తాడు. ప్రస్తుతం కోహ్లి 18 సెంచరీలతో పాంటింగ్‌ తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు. మొదటి స్థానంలో సఫారీ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 25 సెంచరీలతో కొనసాగుుతన్నారు. ఓవరాల్‌గా టెస్టుల్లో కోహ్లి 25 శతకాలు సాధించాడు. ఇందులో సారథిగా 18 శతకాలు ఉండటం విషేసం.వన్డేల్లో కూడా సారథిగా పాంటింగ్‌ 22 శతకాలు సాధిస్తే.. కోహ్లి 21 సెంచరీలతో కొనసాగుతున్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -