Sunday, May 5, 2024
- Advertisement -

బీసీసీఐపై అసంతృప్తిని వ్య‌క్తం చేసిన అండ‌ర్ 19 జ‌ట్టు కోచ్ రాహుళ్ ద్రావిడ్….

- Advertisement -

న్యూజిలాండ్‌లో గత వారం అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత యువ జట్టుకి, కోచింగ్ సిబ్బందికి బీసీసీఐ నజరానా ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. అయితే బీసీసీఐ తీరుపై ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ త‌న అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టోర్నీలో ఓటమి ఎరుగకుండా జైత్రయాత్ర సాగించిన భారత అండర్ -19 జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియాని మట్టికరిపించి నాలుగోసారి విశ్వవిజేతగా నిలిచింది.

ప్రపంచ క్రికెట్‌లో అండర్-19 ప్రపంచకప్‌ని నాలుగు సార్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్ అవతరించింది. ఫైనల్లో భారత్ గెలవగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీగా నజరానాలు ప్రకటించింది. జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌కి రూ. 50 లక్షలు, జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ. 30 లక్షలు, సహాయ కోచ్‌లకు రూ. 20 లక్షలు చొప్పున బహుమానం ప్రకటించింది.

అయితే.. సహాయ కోచ్‌లు కుర్రాళ్లతో పాటు సమానంగా కష్టపడ్డారని వారికి కూడా క్రికెటర్లతో సమానంగా ఇచ్చుంటే బాగుండేదని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడట. అంతేకాకుండా ఈ మేరకు బీసీసీఐకి ప్రత్యేక వినతిని కూడా ఈ మాజీ కెప్టెన్‌ పంపినట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -