Monday, May 13, 2024
- Advertisement -

మ్యాచ్‌ను మ‌లుపు తిప్పిన ఓవ‌ర్ …

- Advertisement -

జొహెన్నస్ బర్గ్‌లో జ‌రిగిన మొద‌టి టీ 20 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకున్న ద‌క్షిణాఫ్రికా ముందుగా భార‌త్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొద‌ట బ్యాటింగ్ చేసి గెలుపొందిన జట్టు కోహ్లి సేన రికార్డ్ నెలకొల్పింది. ముందుగా బ్యాటింగ్ చేసి 203 పరుగులు చేసిన భారత్.. ఆతిథ్య జట్టును 175/9కే పరిమితం చేసింది. లక్ష్యం భారీగా ఉన్నప్పటికీ 15వ ఓవర్ వరకూ సఫారీలు పోరాడారు. కానీ చాహల్ బెహర్డీన్ (39)ను పెవిలియన్ చేర్చి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఈ దశలో సఫారీ బ్యాట్స్‌మెన్ హెండ్రిక్స్ (50 బంతుల్లో 70), క్లాసేన్ (7 బంతుల్లో 16) హిట్టింగ్‌కు దిగారు.

కానీ 18 ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన భువీ.. మ్యాజిక్ చేశాడు. తొలి బంతికి హెండ్రిక్స్‌ను అవుట్ చేసిన భువీ.. తర్వాతి రెండు బంతులకు 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నాలుగు, ఐదు బంతుల్లో క్లాసేన్‌, మోరిస్ (0)లను అవుట్ చేశాడు. వీరిద్దరు ఇచ్చిన క్యాచ్‌లను రైనానే అందుకున్నాడు. మోరిస్ ఇచ్చిన క్యాచ్‌ను రైనా స్థానంలో మరెవరైనా ఉంటే జారవిడిచే వారే. కానీ వేళ్ల మధ్య నుంచి జారిపోతున్న బంతిని కింద పడకుండా రైనా జాగ్రత్త పడ్డాడు.

వరుసగా రెండు వికెట్లు తీయడంతో భువీ హ్యాట్రిక్ ముంగిట నిలిచాడు. చివరి బంతికి హ్యాట్రిక్ వికెట్లు తీసే అవకాశం చేజారింది. కానీ అదే బంతికి ప్యాటెర్‌సన్‌ను పాండ్య, ధోనీ రనౌట్ చేయడంతో భారత్ ‘టీమ్ హ్యాటిక్’ సాధించింది. ఒకే ఓవర్లో సఫారీలు నాలుగు వికెట్లు కోల్పోవడంతో హోరాహోరీ తప్పదనుకున్న మ్యాచ్‌లో భారత్ తేలిగ్గా గెలుపొందింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -