- Advertisement -

రెండో టీ20లో విండీస్ చిత్తు…సిరీస్ కైవ‌సం చేసుకున్న రోహిత్ సేన‌

- Advertisement -

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలుండ‌గానే భారత్ చేజిక్కించుకుంది. రెండో వ‌న్డేలో విండీస్‌ను రోహిత్ సేన చిత్తు చిత్తుగా ఓడించారు.ల‌క్నోలో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 71 పరుగుల తేడాతో గెలుపొందింది. టీ 20లో మొనగాళ్లుగా పేరుగాంచిన విండీస్ క్రికెటర్లు ఏ దశలో కూడా గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. భారత్‌కు ఇది వరసగా ఏడో సిరీస్ విజయం కావడం విశేషం.

లక్నోలో జ‌రిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి విండీస్ బౌలింగ్ ఎంచుకోగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 195 పరుగులు సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 111 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. శిఖర్ ధావన్ (43), లోకేష్ రాహుల్ (26 నాటౌట్) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 195 రన్స్ చేసింది. విండీస్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మొద‌ట ఆచి తూచి ఆడిన ఓపెన‌ర్లు త‌ర్వాత చెల‌రేగిపోయారు.

196 పరుగుల టార్గెట్‌ను ఛేదించడానికి రంగంలోకి దిగిన విండీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ ముగ్గురూ తలా రెండు… వికెట్లు తీశారు. బూమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు దీంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు కేవలం 124 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -