Saturday, April 27, 2024
- Advertisement -

NZ VS IND: సూర్య విధ్వంసం.. భారత్ విజయం!

- Advertisement -

టి20 వరల్డ్ కప్ తరువాత టీమిండియా న్యూజిలాండ్ మద్య జరుగుతున్నా మూడు టి20 మ్యాచ్ లలో భాగంగా మొదటి మ్యాచ్ వర్షార్పణం అయింది. ఇక నేడు జరిగిన రెండవ మ్యాచ్ పై కూడా వర్షం ప్రభావంతో కాస్త ఆలస్యంగా ప్రారంభం అయినప్పటికి కివీస్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. 65 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు ఇషన్ కిషన్ 31 బంతుల్లో 36 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 13 బంతుల్లో 6 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఇక తరువాత క్రీజ్ లోకి వచ్చిన సూర్య కూయంర్ యాదవ్ 51 బంతుల్లో 111 పరుగులు చేసి సెంచరీతో విజృంభించాడు.

శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య చెరో 13 పరుగులు చేయగా.. సూర్య ఒక్కడే చివరి వరకు నిలిచి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. దీంతో 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు.. ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేటట్లుగా కనిపించలేదు. వరుసగా వికెట్లు కోల్పోతూ 126 పరుగులకే కుప్పకూరింది. కెప్టెన్ విలియమ్సన్ 52 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టును ఆధుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. భారత బౌలర్లు విజృంభించడంతో కివీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. దీపక్ హుడా నాలుగు వికెట్లు, చహల్, సిరాజ్ చెరో రెండు వికెట్లు, భువనేశ్వర్, వసింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీసి కివీస్ పాతనాన్ని శాసించారు. ఫలితంగా కివీస్ జట్టు లక్ష్య చేధనలో 18.5 ఓవర్లలో 126 పరుగ్లు చేసి కుప్పకూలింది. దాంతో సిరీస్ లో భారత్ మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

సూర్య విధ్వంసం..
ఒన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన సూర్య కుమార్ యాదవ్.. తన భీకర ఫామ్ ను కొనసాగిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కివీస్ బౌలర్లపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడుతూ 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తన సెంచరీలో ఏకంగా 11 ఫోర్లు 7 సిక్సులు ఉన్నాయి. సూర్య ధాటికి కివీస్ టాప్ బౌలర్లంత చేతులెత్తేశారు. ఇక సూర్య టి20 కెరియర్లో ఇది రెండవ సెంచరీ.

​హ్యాట్రిక్ వికెట్స్
టీమిండియాపై హ్యాట్రిక్ వికెట్లు తీశాడు టిమ్ సౌథి. చివరి ఓవర్లో ఓవర్లో హర్ధిక్ పాండ్య, దీపక్ హుడా, వాసింగ్టన్ సుందర్ ముగ్గురు కూడా సౌథి బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేరారు.

ఇవి కూడా చదవండి : టీమిండియా కోచ్ గా ధోని.. ఐపీఎల్ కు గుడ్ బై?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -