విక్టరీ పరేడ్ తొక్కిసలాటకు కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమేనని నివేదిక ఇచ్చింది జ్యుడీషియల్ కమిషన్. తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), కర్ణాటక స్టేట్ క్రికెట్ అస్సోసియేషన్(KSCA), ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్, బెంగళూరు పోలీసులదే బాధ్యత అని నివేదిక ఇచ్చింది జ్యుడీషియల్ కమిషన్.
నివేదికను సీఎం సిద్దరామయ్యకు అందించింది జ్యుడీషియల్ కమిషన్. ఈ తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయాలుఅయ్యాయి.
విచారణలో భాగంగా ఘటనతో సంబంధం ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది కమిషన్. పలువురు ప్రత్యక్ష సాక్షులు, క్రికెట్ సంఘం అధికారులు, పోలీస్ అధికారుల వాంగ్మాలాలు రికార్డు చేసింది.
నిర్వాహకులు డిజిటల్ ప్రత్యామ్నాయాలు లేకుండా ఫిజికల్ టిక్కెట్లను జారీ చేయడాన్ని కూడా నివేదిక తీవ్రంగా విమర్శించింది. దీనివల్ల అనవసరమైన రద్దీ ఏర్పడిందని, భద్రతా చర్యలు పూర్తిగా విఫలం అయ్యాయని స్పష్టం చేసింది. ఇవి మాత్రమే కాకుండా జన నియంత్రణకు సంబంధించిన పద్ధతుల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కమిటీ స్పష్టం చేసింది. జూలై 17న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో పరిశీలనకు ఉంచుతామని తెలిపారు.
