- Advertisement -

ఐపీఎల్‌..ముస్తాఫిజుర్ మిస్!

- Advertisement -

ఐపీఎల్ 2026కు బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ మిస్ అయ్యే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్థాన్‌తో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)కు ముందు, తరువాత రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఈ సిరీస్‌లో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఉంటాయి. మొదట మార్చిలో పీఎస్‌ఎల్‌కు ముందు వన్డేలు, పీఎస్‌ఎల్ పూర్తయ్యాక మే నెలలో టెస్టులు నిర్వహించే ప్రతిపాదనను బంగ్లాదేశ్… పాకిస్థాన్‌కు చేసినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఎంపికైన బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ఐపీఎల్ మొత్తానికి అందుబాటులో ఉండడని వెల్లడైంది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్ కారణంగా ఆయన ఐపీఎల్ నుంచి ఎనిమిది రోజులు విరామం తీసుకుని జాతీయ జట్టుకు అందుబాటులో ఉంటారని బీసీబీ స్పష్టం చేసింది.

BCB క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ నజ్ముల్ అబెదిన్ మాట్లాడుతూ..మేము ముస్తాఫిజుర్‌కు మొత్తం ఐపీఎల్‌కు NOC ఇచ్చాం. అయితే న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం మాత్రమే ఆయన తిరిగి వస్తారు. ఆ సిరీస్‌కి ఆయన ఉనికి చాలా కీలకం అన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ICC వన్డే ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉంది. 2027 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే టాప్-8లోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ సిరీస్‌ను గెలవడం అత్యంత కీలకమని BCB భావిస్తోంది.

ఐపీఎల్‌లో పోటీ వాతావరణంలో ఆడటం ముస్తాఫిజుర్‌కు మేలు చేస్తుంది. టి20ల నుంచి వన్డేలకు మారడంలో కొంత అడ్జస్ట్మెంట్ అవసరం ఉన్నా, ఆ అనుభవం అతని ప్రదర్శనను మరింత మెరుగుపరుస్తుంది అని నజ్ముల్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -