- Advertisement -

టీ20 వరల్డ్‌కప్‌కు వీరిద్దరూ దూరం!

- Advertisement -

ఈసారి టీ20. వరల్డ్ కప్‌కు వెస్టిండీస్ , అమెరికా సంయుక్తంగా ఆతిథ్య మివ్వనున్న సంగతి తెలిసందే. ప్రపంచకప్ మ్యాచ్‍లు తొలిసారి అమెరికాలో జరగనుండగా ఈ సారి 20 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. ప్రతీ గ్రూప్‍లో టాప్‍లో ఉన్న రెండు జట్లు సూపర్8 స్టేజ్‍కు అర్హత సాధిస్తాయి. తర్వాత ఆ 8 జట్లు రెండు గ్రూప్‍లుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడతాయి. రెండు గ్రూప్‍ల్లో టాప్-2లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‍లో….సెమీ ఫైనల్‍లో గెలిచిన రెండు జట్లు ఫైనల్‍లో టైటిల్ కోసం తలపడతాయి.

ఇక వన్డే ప్రపంచకప్‌ను చేజార్చుకున్న టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ను చేజిక్కించుకోవడం కోసం ప్రణాళికను రచిస్తోంది. 2007లో ధోని కెప్టెన్సీలో టీ 20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన భారత్ తర్వాత ఇంతవరకు టైటిల్ సాధించింది లేదు. ఇక ఈసారి భారత జట్టు భీకర ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్‌ను సాధించాలనే కసితో ఉంది.

అయితే ఈ సారి సీనియర్ ఆటగాళ్లు లేకుండానే టీమిండియా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్థానంలో యువ ఆటగాళ్లకు ప్లేస్ ఇవ్వాలని భావిస్తోంది. అందుకే కొంతకాలంగా టీ20లకు వీరిని దూరం పెడుతూ వస్తోంది బీసీసీఐ. హర్ధిక్ పాండ్యా టీ20 లకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉండగా మొత్తం మీద ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు టీ20 వరల్డ్ కప్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఆసీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతోంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా నెగ్గగా రెండో టీ20 ఆదివారం జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -