Friday, May 3, 2024
- Advertisement -

మా ఆయన వీర్యం ఇప్పించండి సారూ.. కోర్టుకు వెళ్లిన భార్య

- Advertisement -

ఓ యువతి వింత ప్రతిపాదనతో కోర్టు తలుపుతట్టింది. ఆమె ప్రతిపాదనకు అంతా ఆశ్చర్యపోతున్నారు. కానీ భర్త మీద ఆ యువతికి ఉన్న ప్రేమ చూసి చలించిపోతున్నారు. పెళ్లైన కొంతకాలానికే భర్త ఆస్పత్రి పాలయ్యాడు. ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు. ఒక్కరోజుకు మించి బతకలేడని డాక్టర్లు చెప్పారు. దీంతో సదరు మహిళ.. తన భర్తతో పిల్లలను కనాలని భావించింది. అందుకోసం కోర్టు మెట్లు ఎక్కింది. భర్త వీర్యాన్ని ఇప్పించాలని కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది.

గుజరాత్​ లోని అహ్మదాబాద్​ కు చెందిన ఓ యువతి(29) భర్తకు కరోనా సోకింది. శ్వాసలో ఇబ్బంది కలగడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆ యువతి భర్త ప్రస్తుతం ఆస్పత్రిలో లైఫ్​ సపోర్ట్​తో చికిత్స పొందుతున్నాడు. ఒక్కరోజుకు మించి బతకలేడని డాక్టర్లు చెప్పారు.
దీంతో భర్త వీర్యంతో పిల్లలను కని.. భర్త ప్రతి రూపాన్ని తన పిల్లల్లో చూసుకోవాలని ఆమె భావించింది. ఇందుకు అత్తా మామ సైతం ఒప్పుకున్నారు. కానీ ఆస్పత్రి రూల్స్​ అందుకు అడ్డు వచ్చాయి.

వెంటిలెటర్ మీద వ్యక్తి వీర్యాన్ని తీసుకోవచ్చు. అయితే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు ప్రకారం స్పెర్మ్ ఇవ్వటానికి సదరు వ్యక్తి అనుమతి లేకుండా స్పెర్మ్ పొందలేమని తెలిపారు. ప్రస్తుతం సదరు వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడు కాబట్టి.. మీరు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాలని డాక్టర్లు సూచించారు.

ఈ క్రమంలో సదరు యువతి హైకోర్టును ఆశ్రయించింది. ‘నా భర్త చనిపోయినా.. అతని పిల్లలకు తల్లిగా మారాలని భావిస్తున్నాను. కాబట్టి.. వీర్యాన్ని భద్రపరిచి నాకు ఇచ్చేలా ఆస్పత్రిని ఆదేశించండి’ అంటూ సదరు యువతి పిటిషన్​ దాఖలు చేసింది.
గుజరాత్ హైకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది.యువతి కోరిక మేరకు మరణం అంచున ఉన్న సదరు కోవిడ్ -19 రోగి స్పెర్మ్‌ను భద్రపరచాలని ఆస్పత్రిని ఆదేశించింది. కోర్టు తుది ఆదేశాలు వచ్చే వరకు కృత్రిమ గర్భధారణకు వెళ్లడానికి కోర్టు అనుమతి ఇవ్వలేదు.

Also Read

చిన్నపిల్లలకు కూడా కరోనా వ్యాక్సినేషన్​..

5 పైసలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం

ఆక్సిజన్​ బాటిల్స్​ వచ్చేశాయి.. జేబులో పెట్టుకోవచ్చు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -