ఇషాంత్ శ‌ర్మ‌పై సోష‌ల్ మీడియాలో పేలుతున్న జోక్‌లు…

ఐపీఎల్ 2019 సీజన్ ఫైనల్ లో త‌ల‌ప‌డే జ‌ట్టు తేలిపోయింది. ముంబ‌య్ ఇండిన్స్‌, చెన్నై ఉప్పల్ వేదికగా ఆదివారం రాత్రి 7.30 గంటలకి టైటిల్ కోసం త‌ల‌ప‌డ‌నున్నాయి.గత మంగళవారం రాత్రి చెన్నైపై తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గెలిచిన ముంబయి టీమ్ నేరుగా ఫైనల్‌కి చేరగా.. శుక్రవారం రాత్రి విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నై తుది పోరుకి అర్హత సాధించింది.

వైజాగ్ వేదికగా చెన్నై, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ జోకులు పేలుతున్నాయి. ముఖ్యంగా.. ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ బ్యాటింగ్ పైనె జోకులు పేలుతున్నాయి. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన ఇషాంత్ శర్మ (10 నాటౌట్: 3 బంతుల్లో 1×4, 1×6) స్పిన్నర్ జడేజా బౌలింగ్‌లో ఎదుర్కొన్న మూడు బంతుల్లోనే ఒక ఫోర్, సిక్స్‌తో 10 పరుగులు చేశాడు. ఈమ్యాచ్‌లో చెన్నై గెలిచి ఫైన‌ల్లో ముంబ‌య్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

https://twitter.com/akshaygoutam7/status/1126879130438459393
https://twitter.com/LagbhagSecular/status/1126876751525638144