ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇవాళ భారత్–పాకిస్థాన్ జట్లు ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా తలపడనున్నాయి. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుండగా, రోజంతా వర్షం సూచనలు ఉన్నప్పటికీ ఆ సమయానికి వర్షం అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఇరు జట్లు తమ గ్రూపులో మొదటి, రెండో స్థానాల్లో ఉన్నాయి. రెండూ రెండు మ్యాచ్‌లు గెలిచి సూపర్ ఎయిట్ దశకు దాదాపు అర్హత సాధించాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్ ఎయిట్‌కు నేరుగా అర్హత పొందుతుంది. మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించి రెండూ అర్హత సాధిస్తాయి.
మ్యాచ్‌కు 9 గంటల ముందు వరకు ఆకాశం మబ్బులతో కమ్ముకున్నా వర్షం లేదు. ప్రస్తుతం ఆర్ద్రత 94 శాతం ఉంది. రాత్రికి మబ్బులు, పొగమంచు పరిస్థితులు ఉండొచ్చని అంచనా. అయితే 7 గంటల సమయంలో వర్షం అవకాశం కేవలం 9 శాతానికి తగ్గుతుందని అక్కువెదర్ అంచనా.
ఫిబ్రవరి 15న గంటల వారీగా వర్షం అవకాశాలు:ఉ.9 – 33%, 10 – 60%, 11 – 64%, 12 – 49%, మ.1 – 61%, 2 – 49%, 3 – 49%, 4 – 48%, 5 – 63%, 6 – 49%, 7 – 9%.భారత్, పాకిస్థాన్ జట్లు టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు 8 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 7 సార్లు, పాకిస్థాన్ ఒక్కసారి మాత్రమే గెలిచింది.
భారత్ జట్టు అంచనా:
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.
