- Advertisement -

అందుకే రైలులో ప్రయాణం చేశా!

- Advertisement -

టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన అనంతరం, జట్టు సభ్యులు విమాన ప్రయాణానికి సిద్ధమవుతుండగా, దూబే మాత్రం ప్రత్యేకంగా రైలులో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఫైనల్ మ్యాచ్ ముగిసిన కొద్ది గంటల్లోనే దూబే అహ్మదాబాద్ నుంచి ముంబైకి బయలుదేరారు. కుటుంబ సభ్యులను త్వరగా కలవాలనే ఆతృతతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అహ్మదాబాద్–ముంబై మార్గంలో వెంటనే విమానాలు అందుబాటులో లేకపోవడంతో, రైలు ప్రయాణమే వేగవంతమైన మార్గంగా భావించారు. తన భార్య మరియు ఒక స్నేహితుడితో కలిసి తెల్లవారుజామున 3-టియర్ ఏసీ కోచ్‌లో ప్రయాణించారు.

నా బిడ్డను, నా తండ్రిని వెంటనే కలవాలనే ఆత్రుత ఎక్కువగా ఉంది. అందుకే ఉదయం తొందరగా బయలుదేరాను. ఇంకెంతకాలం వేచి ఉండలేకపోయాను అని దూబే ఒక కార్యక్రమంలో తెలిపారు. ఈ నిర్ణయం తీసుకునే సమయంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యాయి. వరల్డ్ కప్ విజయం తర్వాత అభిమానులు గుర్తించే అవకాశం ఉందని ఆయనకు తెలుసు. అయినప్పటికీ, పరిస్థితిని అంచనా వేసి రైలు ప్రయాణమే సరైనదని భావించారు.

విమానాలు లేవు….. రోడ్డు మార్గంలో వెళ్ళొచ్చు కానీ రైలులో త్వరగా వెళ్లవచ్చు కాబట్టి అదే ఎంచుకున్నాను అని చెప్పారు.దూబే నిర్ణయంపై కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో ప్రయాణించడం వల్ల గుర్తింపు పొందే ప్రమాదం ఉందని వారు సూచించారు. అయితే దూబే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

తాను క్యాప్, మాస్క్, ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించి, గుర్తుపట్టకుండా జాగ్రత్తపడ్డారు. అలాగే ఉదయం 5 గంటల సమయం ఎంచుకోవడం ద్వారా స్టేషన్‌లో జనసంచారం తక్కువగా ఉండేలా చూసుకున్నారు.ట్రైన్ బయలుదేరే ఐదు నిమిషాల ముందు వరకు కారులోనే ఉంటాను, తర్వాత త్వరగా ఎక్కేస్తాను అని తన భార్యకు చెప్పినట్లు దూబే వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -