Saturday, May 4, 2024
- Advertisement -

వేరే దేశం తరపున ఆడబోతున్న శ్రీశాంత్.. శ్రీశాంత్ సంచలన ప్రకటన

- Advertisement -

శ్రీశాంత్ పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధంచిన విషయం తెలిసిందే. ఈ జీవితకాల నిషేధం ఎత్తివేయకపోతే తాను వేరే దేశం తరుపున ఆడటానికి రెడీ అని క్రికెటర్ శ్రీశాంత్ తెలిపాడు. తాను ఇంకా క్రికెట్ ఆడగలను అని.. బీసీసీఐ వద్దు అని చెపితే.. తాను వేరే దేశం తరుపున ఆడుతానని అంటున్నాడు. దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశాంత్.. ఈ మేరకు ఆసియానెట్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి మాట్లాడాడు.

నాపై బీసీసీఐ నిషేధం విధించింది. కాబట్టి నేణు వేరే దేశం తరుపునా ఆడొచ్చు.. ప్రస్తుతం నా వయసు 34 సంవత్సారాలు.. ఇంకో ఆరేళ్లపాటు ఆడగల సామర్థ్యం నాకు ఉందని శ్రీశాంత్ అన్నాడు. క్రికెట్ అంటే నాకు ఇష్టం అందుకే ఆదాలని కోరుకుంటున్నా.. నిజానికి బీసీసీఐ ఒక ప్రైవేట్ సంస్థ. మనది భారత జట్టు అని చెప్పుకున్నా.. బీసీసీఐ ప్రైవేట్ సంస్థ అని మీకు తెలుసు. కాబట్టి వేరే దేశం తరుపున ఆడినా, బీసీసీఐ లాంటి ప్రైవేట్ సంస్థకి ఆడినట్టే. అయితే కేరళ తరుపున రంజీ ట్రోఫీలో పాల్గొనడం అనేది దీనికి విరుద్ధం. కేరళ తరఫున రంజీ ట్రోఫీ, ఇరానీ గెలవాలని కలలు కన్నాను. కానీ నా ఆశలపై బీసీసీఐ నీళ్లు చల్లింది’ అని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 6వ సీజన్ (2013) సందర్భంగా జరిగిన స్పాట్‌ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంలో అప్పటి రాజస్థాన్ రాయల్స్ ఆటగాడైన శ్రీశాంత్‌పై అభియోగాలు రుజువు కావడంతో బీసీసీఐ జీవితకాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సమర్పించని కారణంగా 2015లో పాటియాల కోర్టు శ్రీశాంత్‌తో పాటు అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బోర్డు విధించిన నిషేధాన్ని తొలిగించింది. అయినా, బీసీసీఐ తన క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికే కట్టుబడతూ శ్రీశాంత్‌పై ఉన్న నిషేధాన్ని కొనసాగించింది. గతేడాది శ్రీశాంత్ కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో.. సింగిల్ జడ్జ్ బెంచ్ నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే దీనిపై బీసీసీఐ మళ్లీ కేరళ హైకోర్టులో పిటిషన్ వేయడంతో మళ్లీ నిషేధాన్ని పునరుద్ధరించాలని డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -