Wednesday, May 1, 2024
- Advertisement -

ఒకే రోజు 23 వికెట్లు!

- Advertisement -

దక్షిణాఫ్రికా – భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆధ్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రోజే 23 వికెట్లు పడగా మరో రెండు రోజుల్లో ఫలితం తేలే అవకాశం ఉంది. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకోగా తొలి సెషన్‌లోనే కేవలం 23.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. సిరాజ్ ఏకంగా 6 వికెట్లు తీశాడు.

ఇక అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 34. ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ 46, రోహిత్ శర్మ 39 పరుగులు, గిల్ 36 పరుగులు చేశారు. 153 పరుగులకు 5 వికెట్లు కొల్పోగా మిగితా 5 వికెట్లను ఒక్క పరుగు చేయకుండానే ఇన్నింగ్స్‌ను ముగించింది టీమిండియా. సౌతాఫ్రికా బౌలర్స్ లలో ఎంగిడి, రబాడ, కిగీసో తల మూడు వికెట్లు తీశారు.

ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా మొదటి ఆట ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 36 పరుగుల ఆధిక్యంలో ఉంది. మొత్తంగా తొలి రోజే 23 వికెట్లు పడ్డాయి. రెండో టెస్ట్ లో పట్టు కోసం ఇరు జట్లు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. మరి ఏ జట్టు పై చేయి సాధిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -