Saturday, April 20, 2024
- Advertisement -

భారత్, ఇంగ్లండ్‌ మధ్య నేడు తొలి మ్యాచ్‌

- Advertisement -

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానంలో నేడు భారత్, ఇంగ్లండ్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది. ఇప్పటికే టి20 సిరీస్‌ గెలుచుకున్న టీమిం డియా ఇక్కడా విజయం సాధించాలని పట్టుదలతో ఉండగా, వన్డేల్లో ఇటీవలి తమ ధాటిని కొనసాగించాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది.కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌ను బట్టి చూస్తే అతని కోసం కోహ్లి మరోసారి నాలుగో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. రోహిత్‌ శర్మ ఊపు మీదుండగా, ధావన్‌ ఫామ్‌ కొంత ఇబ్బందిగా మారింది.

దినేశ్‌ కార్తీక్‌కు మిడిలార్డర్‌లో బ్యాట్స్‌మన్‌గా చోటు ఖాయమైంది. అతని కోసం రైనాను పక్కన పెట్టాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ యోచిస్తోంది. చివరి ఓవర్లలో పాండ్యా, ధోని చెలరేగిపోగలరు. ఇటీవలే ఆస్ట్రేలియాను 5–0తో చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్‌ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని కోరుకుంటోంది.. ఆసీస్‌తో వన్డేలు ఆడని ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌కు ఇప్పుడు నేరుగా జట్టులో చోటు ఖాయం. గత ఏడాది కాలంలో ఆడిన 21 వన్డేల్లో ఇంగ్లండ్‌ 4 మాత్రమే ఓడింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -