Sunday, May 5, 2024
- Advertisement -

అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్‌క‌ప్ విశ్వ‌విజేత భార‌త్‌కు భారీ న‌జ‌రానా …జ‌ట్టుకు ప్ర‌ముఖుల ప్ర‌శంశ‌లు..

- Advertisement -

అండర్-19 వరల్డ్ కప్‌లో యువ భారత్ సత్తా చాటింది. ఓటమి అనేదే లేకుండా వరుస విజయాలతో ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ప్రతి మ్యాచ్‌లో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ.. ఘన విజయాలతో ఫైనల్ చేరిన పృథ్వీ షా సేన ఆఖరి మ్యాచ్‌లోనూ అద్భుతమైన ఆటతీరు కనబర్చింది. ఏ మాత్రం ఒత్తిడిని దరి చేరనీయకుండా.. ప్రతి దశలోనూ ఆధిపత్యం చెలాయించిన యువ భారత్‌ను ప్రపంచ కప్‌ను ముద్దాడింది. నాలుగుసార్లు అండర్-19 వరల్డ్ కప్ నెగ్గిన తొలి భారత జట్టుగా రికార్డ్ నెలకొల్పింది. ఈ విజయంతో అఖండ భారతావని మురిసిపోయింది.

భారత్ అండర్-19 ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వరల్డ్ కప్ సాధించి దేశప్రతిష్ఠను ఇనుమడింపజేసిన జట్టుకు బీసీసీ భారీ నజరానా ప్రకటించింది. జట్టు, చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు 50 లక్షల నజరానా ప్రకటించింది. సపోర్టింగ్ స్టాఫ్ కు 20 లక్షల నజరానా ప్రకటించింది. టీమిండియా మాజీ ఆటగాళ్లైన సచిన్ టెండూల్కర్, సురేష్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అండర్-19 ఆటగాళ్లకు ట్విట్టర్ మాధ్యమంగా శుభాకాంక్షలు చెప్పారు.

రాహుల్ ద్రావిడ్ శిక్షణ, కుర్రాళ్ల అంకిత భావం కలగలిపి భారత్‌ విశ్వ విజేతగా ఆవిర్భవించింది. యువ ఆటగాళ్లను ఎంతగానో ప్రోత్సహించే ద్రావిడ్.. అండర్-19 కోచ్‌‌గా తన అనుభవాన్ని రంగరించి కుర్రాళ్లకు పాఠాలు నేర్పాడు. దూకుడుగా ఆడమంటూనే వికెట్ విలువ నేర్పాడు. అందుకే శుభమ్ గిల్, మన్జోత్ కల్రాలు నిలకడగా ఆడి సెంచరీలు సాధించారు

రైనా తన ట్విట్టర్ ఖాతాలో అజేయమైన భారత అండర్ 19 ఆటగాళ్లు విజయానికి వందశాతం అర్హులు. ఈ విజయాన్ని ఆస్వాదించండి. కానీ ఇది ఆరంభం మాత్రమేనని గుర్తించండి. జట్టు విజయం వెనుక నిరంతర స్పూర్తిగా నిలిచిన రాహుల్ ద్రవిడ్ కు పెద్ద కేక.

 

సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా, వర్ధమాన ఆటగాళ్లు రాహు ద్రవిడ్ వంటి దిగ్గజం సురక్షితమైన చేతుల్లో ఉన్నారని, భవిష్యత్ క్రికెట్ కు అద్భుతమైన ప్రతిభగల క్రీడాకారులు తయారవుతున్నారని పేర్కొన్నాడు. ప్రతిభారతీయుడు రాహుల్ ద్రవిడ్ అంకితభావాన్ని కొనియాడుతున్నారని ప్రశంసించాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -