Sunday, May 12, 2024
- Advertisement -

ధోనీ సాధించ‌లేనిది కోహ్లీ సాధిస్తాడు…

- Advertisement -

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ కోహ్లి సారథ్యంలోని టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయగలదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియాకి’ మంగళవారం రాసిన వ్యాసంలో.. భారత్ పర్యటనల గురించి తన అభిప్రాయాన్ని గంగూలీ వివ‌రించారు.

విరాట్ కోహ్లీ నాయకత్వంపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో తొలుత మూడు టెస్టుల సిరీస్‌ని 1-2తో చేజార్చుకున్న భారత్ జట్టు.. ఆరు వన్డేల సిరీస్‌ని 5-1తో, మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న భారత్.. అనంతరం చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనుంది.

భారత్ జట్టు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చివరి పర్యటనల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అప్పట్లో మహేంద్రసింగ్ కెప్టెన్సీలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనని 0-2తో, ఆస్ట్రేలియా టూర్‌ని 1-3తో పేలవ రీతిలో ముగించింది. అయితే.. గత వారం ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనని చూసిన తర్వాత.. కోహ్లి నాయకత్వంలోని భారత జట్టు ఆ రెండు దేశాల్లో మెరుగైన ప్రదర్శన చేయగలదని గంగూలీ వివరించాడు. ధోనీ నాయ‌క‌వ‌త్వంలో సాధించ‌లేద‌ని ధోనీ సాధిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -