కెప్టెన్‌గా టెస్టుల్లో మ‌రో రికార్డు సాధించిన కోహ్లీ….

- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటి వరకూ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఈ రికార్డ్ ఉండగా.. కోహ్లి దాన్ని బద్దలుకొట్టాడు. కెప్టెన్‌గా 96 ఇన్నింగ్స్ ఆడిన ధోనీ 3454 పరుగులు చేయగా.. కోహ్లి కేవలం 57 ఇన్నింగ్స్‌ల్లోనే ధోనీని అధిగమించాడు. ఈ జాబితాలో 3449 పరుగులతో సునీల్ గావస్కర్ మూడో స్థానంలో నిలిచాడు.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా భారత కెప్టెన్‌గా అత్యధిక పరుగుల రికార్డును చేరుకున్నాడు

- Advertisement -

ఇప్పటి వరకూ కెప్టెన్‌గా 35 టెస్టులు ఆడిన కోహ్లి 3455 పరుగులు చేశాడు. భారత్‌లో 19 టెస్టులకు నాయకత్వం వహించిన విరాట్ 71.10 సగటుతో 2062 పరుగులు చేశాడు. వీటిలో ఏడు సెంచరీలు ఉన్నాయి. విదేశాల్లో 16 టెస్టులు ఆడిన కోహ్లి.. 60.60 యావరేజ్‌తో 1394 రన్స్ చేశాడు. విదేశీ గడ్డ మీద కూడా కోహ్లి ఏడు సెంచరీలు చేయడం గమనార్హం.

ఓవరాల్‌గా కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 8659 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -