ఒక్క ఇన్నింగ్స్ లో ఇన్ని రికార్డులా.. కోహ్లీకే ఇది సాధ్యం..!

- Advertisement -

పరుగుల రారాజు అయిన విరాట్ కోహ్లీ తన రికార్డులను తానే బద్దలు కొడుతున్నాడు. దక్షీణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేశాడు. అంతేకాకుండా 7000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

కెఫ్టెన్ గా ఉంటూ 40 సెంచరీలు చేసిన మొదటి భారత బ్యాట్స్ మన్ కోహ్లీనే. అంతర్జాతీయ స్థాయిలో అయితే ఈ రికార్డు పాంటింగ్ పేరిట ఉంది. ఇతను కెప్టెన్ గా 41 శతకాలు సాధించాడు.

- Advertisement -

ఇక టెస్టు సెంచరీలో పాంటింగ్ కెఫ్టెన్ గా ఉంటూ 19 సెంచరీలు చేయగా… సరిగ్గా కోహ్లీ కూడా కెప్టెన్ గా టెస్టుల్లో 19 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెఫ్టేన్ గ్రేమ్ స్మిత్ 25 సెంచరీలతో ముందులో ఉన్నాడు.

ఇక భారత క్రికెట్ లో ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్లలో కోహ్లీ నెంబర్ వన్ గా ఉన్నాడు. కోహ్లీ ఏడు డబుల్ సెంచరీలు చేయగా.. వీరేందర్ సెహ్వాగ్ (6), సచిన్ టెండూల్కర్ (6), రాహుల్ ద్రావిడ్ (5), సునీల్ గవాస్కర్ (4) ఉన్నారు.

ఇక టెస్టుల్లో ఎక్కువసార్లు 150 పైగా పరుగులు సాధించిన క్రికెటర్ గా డాన్ బ్రాడ్ మన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. కోహ్లీ 9 సార్లు 150 పైగా పరుగులు చేయగా.. బ్రాడ్ మన్ 8 సార్లు ఈ ఘతనత సాధించాడు.

పూణే మ్యాచ్ లో కోహ్లీ 254 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు ఓ భారత కెఫ్టెన్ సాధించిన అత్యధిక స్కోర్ ఇదే. కోహ్లీ తర్వాత ధోనీ (224), సచిన్ (217) ఉన్నారు.

ఇక టెస్టుల్లో ఎక్కువ సెంచరీల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ 51 మొదటి స్థానంలో ఉండగా.. కోహ్లీ 26, స్టీవ్ స్మిత్ 26, గ్యారీ సోబర్స్ (26), ఇంజమాముల్ హక్ (25) ఉన్నారు.

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -