- Advertisement -

WTC: టాప్-2లోకి న్యూజిలాండ్

- Advertisement -

న్యూజిలాండ్–వెస్టిండీస్ మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మూడో టెస్ట్ ముగిసింది. బ్లాక్ క్యాప్స్ ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించడంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) పాయింట్స్ టేబుల్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

డిసెంబర్ 18 నుంచి 22 వరకు మౌంట్ మాంగనూయిలోని బే ఓవల్‌లో జరిగిన ఈ టెస్టులో న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేసింది. టామ్ లాథమ్ 137 పరుగులు, డెవన్ కాన్వే 227 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 575 పరుగులు సాధించింది.

రెండో ఇన్నింగ్స్‌లోనూ లాథమ్ (101), కాన్వే (100) సెంచరీలు చేయడంతో న్యూజిలాండ్ 306 పరుగుల వద్ద డిక్లేర్ చేసి వెస్టిండీస్‌కు 462 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య చేధనలో వెస్టిండీస్ పూర్తిగా విఫలమైంది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి వెస్టిండీస్ 138 పరుగులకే ఆలౌటైంది. జాకబ్ డఫీ ఐదు వికెట్లు తీయగా, అజాజ్ పటేల్ మూడు వికెట్లు సాధించాడు. దీంతో న్యూజిలాండ్ 323 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ విజయంతో న్యూజిలాండ్ WTC పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లోకి దూసుకెళ్లింది. మరోవైపు, వెస్టిండీస్ ఇప్పటికే చివరి స్థానంలో ఉండగా, ఈ మ్యాచ్ తర్వాత కూడా అదే స్థితిలో కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -