Saturday, April 20, 2024
- Advertisement -

టీ మిండియా మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌గా ఇండియ‌నే…

- Advertisement -

భారత మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌గా మాజీ ఆటగాడు ఊర్కెరి వెంకట్‌ రామన్‌ ఎంపికయ్యారు. తొలి ప్రాధామ్యంగా ఉన్న గ్యారీ కిర్‌స్టన్‌ను కాదని బీసీసీఐ ఆయనను ఎంపిక చేసి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. మహిళల జట్టు కోచ్‌గా ఉన్న రమేశ్ పొవార్ పదవీ కాలం ముగియడంతో బీసీసీఐ కొత్త కోచ్ ని ఎంపిక చేసింది. గ్యారీ కిర్‌స్టెన్, హెర్షల్‌ గిబ్స్, ట్రెంట్‌ జాన్‌స్టన్, మార్క్‌ కోల్స్ వంటి హేమాహేమీలను అధిగమించి కోచ్‌ పదవిని దక్కించుకున్నారు.

దిగ్గజాలైన కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంతా రంగస్వామి నేతృత్వంలోని ఎంపిక కమిటీ కిర్‌స్టన్‌కు తొలి ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో బ్యాటింగ్‌ సలహాదారుగా పనిచేస్తున్నారు. ఆయనకిప్పుడు 53 ఏళ్లు.

డబ్ల్యూవీ రామన్ ప్రస్తుతం బెంగాల్‌ రంజీ టీమ్‌ కోచ్‌గా ఉన్నారు. క్రికెట్‌పై విశేష పరిజ్ఞానం ఉన్న 53 ఏళ్ల రామన్‌.. భారత అండర్‌–19తో పాటు బెంగాల్, తమిళనాడు రంజీ జట్లకు, ఐపీఎల్‌లో కోల్‌కతా, పంజాబ్‌ జట్లకు శిక్షకుడిగా వ్యవహరించారు. భారత్‌ తరఫున రామన్‌ 11 టెస్టులు, 27 వన్డేలు ఆడారు. ప్రస్తుతం ఆయన దేశంలోనే అత్యుత్తమ అర్హతలున్న కోచుల్లో ఒకరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -