Sunday, May 5, 2024
- Advertisement -

జ‌గ‌న్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కోర్టు

- Advertisement -
Court Serious On Jagan Absence

ఏ పని ఉన్నా.. కేసు విచారణ ఉంటే.. ఖచ్చితంగా కోర్టుల‌కు హాజ‌రు అవ్వాల్సిందే. ఒకవేళ.. కొన్ని పరిస్థుల కారణం వల్ల హాజరు కాకుంటే.. అందుకు సంబంధించిన కారణాన్ని చూపించాల్సి ఉంటుంది. అయితే.. అలాంటిదేమి లేకపోవడంతో.. వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి తాజాగా సీబీఐ ప్ర‌త్యేక కోర్టు ఆగ్ర‌హానికి గుర‌య్యారు.

జ‌గ‌న్ త‌న కంపెనీల్లో పెట్టుబ‌డుల‌కు సంబంధించిన కేసు విచార‌ణకు హాజ‌రు కావాల్సి ఉంది. సీబీఐ ప్ర‌త్యేక కోర్టుకు రావాల్సిన జ‌గ‌న్‌.. పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో పాల్గొనాల‌నే పేరుతో హాజరు కాకపోతే ఎలా..? అని తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. కోర్టు విచారణ ఉన్నప్పటికి.. పార్టీ ప్లీన‌రీలో ఎలా పాల్గొంటారు అంటూ.. అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. నిందితులంద‌రికి చాలా పనులు ఉంటాయి.. అలా అని కోర్టుకు రామంటే ఎలా కుదురుతుంది.. అని సూటిగా ప్రశ్నించారు. రోజుకో నిందితుడు హాజ‌రుకాకుంటే విచార‌ణ ఎలా ముందుకు సాగుతుంది? అంటూనే.. కోర్టు హాజ‌రుకు మిన‌హాయింపు కోరేందుకు ప్లీన‌రీలో హాజ‌రు కావాల్సి రావ‌టం అన్న‌ది స‌రైన కార‌ణం కానే కాద‌ని పేర్కొంది. భవిష్యత్తులో ఇదే తరహాలో వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో హాజ‌రుకు మిన‌హాయింపు కోరితే అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందంటూ జ‌గ‌న్ త‌ర‌ఫు లాయ‌ర్‌కు సీబీఐ ప్ర‌త్యేక కోర్టు జ‌డ్జి హెచ్చ‌రించారు.

ఇలాంటివి భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌కుండా చూసుకుంటామ‌ని జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు వెల్ల‌డించారు. ఫార్మా పెట్టుబ‌డుల‌కు సంబంధించిన 11 అభియోగ ప‌త్రాల్లో నిందితులుగా ఉన్న ప‌లువురు (జ‌గ‌న్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి.. మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి.. ఐఏఎస్ అధికారులు శ్రీల‌క్ష్మి.. మ‌న్మోహ‌న్ సింగ్‌.. మ‌ర‌ళీధ‌ర్ రెడ్డి.. కంపెనీ ప్ర‌తినిధులు నిమ్మ‌గ‌డ్డ ప్ర‌కాష్ త‌దిత‌రులు) హాజ‌ర‌య్యారు. 

{youtube}Bdr_O6H2qu4{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. జ‌గ‌న్‌పై సీబీఐ కేసుల‌న్నీ డొల్లే అని టీడీపీ లో చర్చ.
  2. పార్టీ నాయ‌కుల గురించి జ‌గ‌న్‌కునివేదిక ఇచ్చిన ప్ర‌శాంత్ కిషోర్..
  3. భ‌విష్య‌త్తులో బాబులాంటి ప‌రిస్థితులే జ‌గ‌న్‌కు ఎదుర‌వుతాయా….?
  4. ఆంధ్రా ప‌ప్పు లోకేష్‌.. పులి జ‌గ‌న్‌..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -