- Advertisement -

శుభవార్త… ఇక పై ఏటీఎంలో 50 రూపాయల నోట్లు!

- Advertisement -
now fifty rupees notes also available in atm centers rbi decision

500, 1000 నోట్లను రద్దు చేయడంతో… దేశంలో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు నుంచి బ్యాంకుల్లో పాత నోట్లను తీసుకొని కొత్త నోట్లను ఇచ్చే ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. కొత్త నోట్లను ఇస్తుండటంతో..  కొంతవరకూ ఉపశమనం లభించినట్లైంది. అయితే ఇప్పుడు అందరిని ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య చిల్లర. సామాన్య ప్రజలు చిల్లర కోసం నానా పాట్లు పడుతున్నారు. ఇది ఇలా ఉంటె బ్యాంకుల్లో 2వేల రూపాయలు, 5వందల రూపాయల కొత్త నోట్లు మాత్రమే ఇస్తారు.

మరి చిల్లర పరిస్థితి ఏంటి? 500, 1000 రూపాయలు రద్దు చేయడంతో జనం చిన్న నోట్ల కోసం ఎగబడుతున్నారు. ఇలాంటి వారి కోసం ఆర్ బీఐ ఓ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై ఏటీఎం లలో 50రూపాయల నోట్లను కూడా మనం తీసుకోవచ్చు. అన్ని ఏటీఎం సెంటర్లలో 50రూపాయల నోట్లు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తోంది.

ఇప్పటివరకూ 100 నోట్ల సంఖ్యను పెంచిన ఆర్బీఐ, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 50 రూపాయల నోట్లను కూడా ఇక నుంచి ఏటీఎంల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించున్నట్లు సమాచారం. అయితే కేవలం నిబంధన ప్రకారం రోజుకు 2వేల రూపాయలు మాత్రమే డ్రా చేయాలట. ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే చాలామంది కష్టాలు తీరనున్నాయి.

Related

  1. లక్షల కోట్లు రోడ్డున పడ్డాయి… కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఇంత..?
  2. కొత్త 500, 1000 నోట్ల విశేషాలు ఇవే!
  3. షూటింగ్ లకు షాక్ ఇచ్చిన మోడీ!
  4. ప్రజలకు, బ్యాంకులకు రానున్న వారం రోజులు చుక్కలే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -