Monday, May 13, 2024
- Advertisement -

మీకు రిలయన్స్ జియో sim కావాలా ?

- Advertisement -
Snapdeal partners with Reliance Jio to provide home delivery of SIM card

ఈ కామర్స్ సంస్థ స్నాప్ డీల్ ఇప్పుడొక ఆసక్తికర అంశాన్ని తెరమీదకి తీసుకుని వచ్చింది. రిలయన్స్ జియో – స్నాప్ డీల్ ఇద్దరూ కలిసి తెరమీదకి ఒక ఆసక్తికర ఆఫర్ ని తీసుకుని వచ్చారు. అపరిమిత ఉచిత కాల్స్- ఎస్ఎంఎస్లు-  4జీ ఇంటర్నెట్తో సంచలనాలకు తెర తీసిన జియో తన సిమ్ కార్డులను హోం డెలివరీ చేయనుందని ఇదివరకే తెలుసుకున్నాం.

అయితే గతంలో ఈ హోం డెలివరీ ప్రక్రియను జియో కేవలం పైలట్ ప్రాజెక్ట్గానే ప్రారంభించి ఇన్విటేషన్ ప్రాతిపదికన ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే సిమ్లను హోం డెలివరీ చేస్తూ వచ్చింది. అయితే ఇకపై అలా కాదు. ఈ-కామర్స్ సైట్ స్నాప్డీల్ ద్వారా జియో తన సిమ్ కార్డులను యూజర్లకు అందించనుంది. 

ఇందుకోసం ఏం చేయాలనే కదా మీ సందేహం…స్నాప్డీల్ సైట్లోకి వెళ్లి యూజర్లు జియో సిమ్ కోసం ముందుగా రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. అయితే ఆ రిక్వెస్ట్లో యూజర్ డెలివరీ టైమ్ స్లాట్ను ఎంపిక చేసుకోవాలి. యూజర్ కొరియర్ సర్వీస్కు ఎప్పుడు అందుబాటులో ఉంటాడో ఆ తేదీ సమయాన్ని స్లాట్లో ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో రిక్వెస్ట్ కన్ఫం అయినట్టు యూజర్కు ఓ ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో ఆఫర్ కోడ్ డెలివరీ టైం స్లాట్ వంటి వివరాలు ఉంటాయి. ఈ క్రమంలో కొరియర్ సర్వీస్ వారు సదరు టైమ్ స్లాట్లో యూజర్ ఇంటికి రాగానే సిమ్ను డెలివరీ చేస్తారు.

ఆ సమయంలో యూజర్ తన ఆధార్ కార్డును అలాగే తనకు వచ్చిన ఎస్ఎంఎస్లోని వివరాలను కొరియర్ సర్వీస్ వారికి అందజేయాల్సి ఉంటుంది. దీంతో వారు జియో సిమ్ను అప్పటికప్పుడే యాక్టివేట్ చేసేస్తారు. అయితే స్నాప్డీల్ ద్వారా అందుబాటులోకి రానున్న ఈ జియో సిమ్ల హోం డెలివరీ కచ్చితంగా ఎప్పుడు ప్రారంభమవుతుందో జియో ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను ప్రారంభించాలని జియో భావిస్తున్నట్టు తెలిసింది.ఇదండి ముఖేష్ కొత్త మంత్రం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -