Friday, May 3, 2024
- Advertisement -

కొంప‌ముంచిన మిస్ట్ కాల్స్… రూ.2 కోట్లు హుష్ కాకీ

- Advertisement -

కేవలం ఆరు మిస్డ్ కాల్స్ కారణంగా దాదాపు రెండు కోట్ల రూపాయల సొమ్ము కోల్పోయాడు ఓ బిజినెస్ మ్యాన్. పెరుగుతున్న టెక్నాల‌జీతో పాటే సైబ‌ర్ నెరగాళ్లు కూడా ఎంత అప్‌డేట్ అవుతున్నార‌నే దానికి ఈ ఘ‌ట‌న ఓ ఉద‌హార‌ణ‌.

వీ షా అనే వ్యక్తి ముంబైలోని మహిమ్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. యూకే కోడ్ (+44)తో వచ్చిన ఆరు మిస్డ్ కాల్స్ తర్వాత…. అత‌ని అకౌంట్‌లో నుంచి రూ. 1.86 కోట్లు మాయమయ్యాయి. గ‌డ‌చిన ఏడాది డిసెంబ‌ర్ 27న అర్ధరాత్రి 2 గంటలకు షాకి ఒకే నెంబర్‌తో ఆరు మిస్డ్ కాల్స్ వచ్చాయి.(+44) డైలింగ్ కోడ్‌తో వచ్చిన మిస్డ్‌ కాల్‌ను ఉదయాన్నే చుసిన షా… తిరిగి ఆ నెంబర్‌కు కాల్ చేశాడు. అదే అత‌ను చేసిన త‌ప్పు. ఆ కాల్ చేసిన కొద్ది సేప‌టికే సిమ్ డీ- యాక్టివేటెడ్ అని ఓ మెసేజ్ వచ్చింది. కొద్దిసేపటి తర్వాత కస్టమర్ కేర్ నుంచి అతడికి ఫోన్ వచ్చింది. ‘మీ కోరిక మేరకు సిమ్ కార్డ్ బ్లాక్ చేస్తున్నాం…’ అన్న వాయిస్ విని షా కి షాక్ తగిలినంత పనైంది.

ఎక్క‌డో తేడా కొడుతుంద‌ని బ్యాంకుకి వెళ్లి అకౌంట్ చెక్ చేసుకోగా… రూ. కోటి 86 లక్షలు మాయమైనట్టు తేలింది. దీంతో వెంట‌నే సైబ‌ర్ సెల్‌ను బాధితుడు ఆశ్ర‌యించాడు. సిమ్ కార్డు ద్వారా సమాచారాన్ని సేకరించిన సైబర్ క్రైమ్ నేరగాళ్లు… ఖాతాలో డబ్బు కాజేసినట్టు నిర్ధారించారు. ఆ డబ్బును 28 ట్రాన్సాక్షన్స్ ద్వారా దేశంలోని 14 ఖాతాలకు పంపినట్టు రిపోర్ట్‌లో తేలింది.

విదేశాల నుంచి వ‌చ్చే నెంబ‌ర్ల ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -